Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి మరాత్వాడ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఇక్కడ ఆరెంజ్ అలర్ట్
మే 5న దీర్ఘకాల వడగాలులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 42 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. 66 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఏర్పడి ఈరోజు తక్కువగా గుర్తించారని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపారు.
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.