Weather Latest News: నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖతం, దానిని ఆనుకొని వున్న ఉత్తర ఒడిశా - గంగా పరివాహిక పశ్చిమ బెంగాల్ తీరం వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని అనుబంధ ఆవర్తనం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖతం పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి  7.6 కి. మీ. ఎత్తులో కొనసాగుతుందని తెలిపారు. 


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 


ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)


ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన  తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


నేడు బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వీచే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీలుగా నమోదైంది. 80 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.