Weather Latest News: ఆగస్టు 29న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న తూర్పు-మధ్య బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఉదయం 0830 గం.లకు మధ్య మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఒకటి ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల 30న పశ్చిమ - మధ్య మరియు పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం వుంది. ఇది రాబోయే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ-మధ్య మరియు పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, రేపు చాలా చోట్ల మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings):
రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో, రేపు ఎల్లుండి గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం వుంది.
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. 78 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగస్టు 29న 8.30 గంటల సమయంలో మధ్య, ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 30వ తేదీన మరింతగా బలపడి పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతమైయ్యే అవకాశం ఉంది.
తర్వాత ఉత్తర ఏపీ, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా మరో 2 రోజుల్లో అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.