Weather Latest News: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖతం పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖతంలో ఆల్పపీడనం ఒకటి సగటు సముద్ర మట్టానికి  5.8 కి. మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి వస్తున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 


ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)


ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన  తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వీచే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32.1 డిగ్రీలు, 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. 80 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: రుతుపవనాల ఉత్తర పరిమితి జైసల్మేర్, చురు, భివానీ, ఢిల్లీ, అలీఘర్, కాన్పూర్, ఘాజీపూర్, గోండా, ఖేరీ, మొరాబాద్, డెహ్రాడూన్, ఉనా, పఠాన్ కోట్, జమ్మూ గుండా వెళ్తుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయువ్య, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుపాను ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్ప పీడన ప్రాంతం ఏర్పడింది. అనుబంధ తుపాను ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదిలించే అవకాశం ఉంది .మధ్య గుజరాత్, పొరుగున ఉన్న తుపాను ప్రసరణ ఇప్పుడు దక్షిణ గుజరాత్ పై ఉంది. సముద్ర మట్టం నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.