TS DSC 2024 Exam Schedule: తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించింది. దీనిప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్(SA) ఫిజికల్ సైన్స్‌ పరీక్ష, సెకండ్‌షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పరీక్ష జరగనున్నాయి. ‌జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ (SGT) పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్ (SA Maths), జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్‌ సైన్స్‌ (SA Biology), ‌జులై 26న తెలుగు భాషా పండిట్‌ (Telugu Language Pandit), సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్ (SA Social Studies) పరీక్ష నిర్వహిస్తారు.


రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం విధితమే. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల పరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.


టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు..


➥ జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష


➥ జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు


➥ జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష


➥ జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష


➥ జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష


➥ జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు


➥ జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష


➥ జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.


➥ ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.


తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 17 నుంచి కంప్యూటర్ ఆధారిత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు గడువు జూన్ 20తో ముగియగా.. మొత్తం 2,79,956 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులు రాగా.. తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు అందాయి. నాన్‌లోకల్ కోటా (5 శాతం) కింద అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలకు చెందినవారు కూడా.. హైదరాబాద్ జిల్లాలో అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అతి తక్కువగా మేడ్చల్ జిల్లా నుంచి 2,265 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 25 చొప్పున పోటీపడుతున్నారు.




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .