Telangana BJP News: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఆపరేషన్ మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పార్లమెంట్ సత్తచాటుతామని అధిష్టానం పార్టీ నేతలు అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వరంగల్ పార్లమెంటు విజయం ఆశలు పెట్టుకున్నారు. 40 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తామనుకున్నారు. విజయం సాధ్యం కాకపోవడంతో ఓటమి పై జాతీయ అధిష్టానంకు చెందిన పెద్దలు ఆరాతీశారట.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ ప్రభంజనం, మోదీ హవా, రామమందిర నిర్మాణం, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ తో రాష్ట్రంలో ఎనమిది మంది ఎంపీలుగా గెలిశారు. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిన వరంగల్ పార్లమెంట్ లో బిజేపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలవలేక పోయారు. బీజేపీ పార్టీ ప్రారంభంలో 1984 లో జరిగిన ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిన బీజేపీ రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అందులో ఒకటి వరంగల్ స్థానం. రెండవది గుజరాత్ రాష్ట్రంలో. అయితే వరంగల్ స్థానం ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. బిజేపి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి గెలవాలని పట్టుదలతో బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీఅర్ఎస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నేత ఆరూరి రమేష్ ను పార్టీలోకి తీసుకొని బరిలో దింపింది. బలమైన అభ్యర్థి, బీజీపీ ప్రభంజనం కొనసాగిన వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేక పోవడంతో అధిష్టానం, క్యాడర్ అంతర్మధనంలో పడ్డారు. అయితే ఓటమిపై ఢిల్లీ పెద్దలు ఆరాతీసినట్లు సమాచారం.
వరంగల్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం 2009 పునర్ విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడు స్థానం అయ్యింది. నాలుగు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు బిఆరెస్ గెలిచింది. అయితే గత మూడు ఎన్నికల్లో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా పొందలేక పోయింది. నిలకడలేని నేతలతోపాటు, స్థానికేతరులను అభ్యర్థులుగా బరిలోకి దింపి బలహీన పడింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఓటు బ్యాంకుతో 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలవాలని గట్టి ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా వరంగల్ స్థానాన్ని సెంటిమెంట్ సీట్ గా భావించింది. అందుకే ఇక్కడ ఎలాగైనా గెలవాలని భావించి. బలమైన దళితనాయకుడిని బరిలోకి దింపి గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది.
ఫలితం మాత్రం నిరాశే
బీజేపీ ప్రభంజనం, మోడీ హవా, అయోధ్య రామమందిర నిర్మాణం, వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆరూరి రమేష్ ను బరిలోకి దింపింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఫలితం రాలేదు. పార్టీ, క్యాడర్ పూర్తి స్థాయిలో లేకపోవడం, ఉన్న చోట గ్రూప్ తగదాలు ఉండటం వలన గెలుపును ఆదుకోలేక పోయామని స్వంత పార్టీ నేతలు చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేయాలనుకున్న ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితి. మరికొన్ని చోట్ల పార్టీ వీక్ గా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బలహీనంగా ఉండటం, అనుకున్న స్థాయిలో క్యాడర్ సమన్వయంతో పని చేయక పోవడం వల్లే ఓటమి చెందినట్లు నిర్ణయానికి వచ్చారట.
వీటికి తోడు మోడీ చరిష్మాతోనే గేలుస్తామనే అభ్యర్థి అతివిశ్వాసం, పార్టీ క్యాడర్ ను సమన్వయ పరచకపోవడం, పోల్ మేనేజ్మెంట్ చేకపోవడం ఓటమికి కారణమని తేల్చారట. బలమైన నేతగా పక్కాపార్టీ నుండి తీసుకువచ్చిన అరూరి రమేష్ ఇమేజ్ పనిచేయలేదట. వచ్చిన అవకాశాన్ని వదులుకున్నమని బీజేపీ మదనపడిందట. ఓటమికి గల కారణాలను జిల్లా నేతలు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. జిల్లా నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్నాము కాబట్టి మొత్తానికి ఓటమి నుండి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగితే వచ్చి రోజులు మనయే అని బీజేపీ శ్రేణులు ధీమాగా ఉన్నారట.