Telangana Civil Assistant Surgeon Recruitment: తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (DPH&FW)/ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి జులై 2 నుంచి 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
వివరాలు...
* సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 435
మల్టీజోన్-1: 271 పోస్టులు, మల్టీజోన్-2: 164 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
➨ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 431 పోస్టులు
➨ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 04 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 46 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.120 చెల్లించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ప్రాసెసింగ్ ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 80 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులకు, 20 మార్కులు ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు/కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసిన సర్వీసుకు ఉంటుంది.
జీతం: రూ.58,850 – రూ.1,37,050.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➽ ఆధార్ కార్డు
➽ పదోతరగతి లేదా తత్సమాన మార్కుల సర్టిఫికేట్
➽ ఎంబీబీఎస్ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో
➽ ఎంబీబీఎస్ సర్టిఫికేట్
➽ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➽ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
➽ స్టడీ సర్టిఫికేట్ (1 నుంచి 7వ తరగతి) .
➽ రెసిడెన్స్ సర్టిఫికేట్.
➽ కమ్యూనిటీ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/బీసీ).
➽ తెలంగాణ ప్రభుత్వ కంపేటెంట్ అథారిటీ జారీచేసిన బీసీ(నాన్ క్రీమీ లేయర్) సర్టిఫికేట్
➽ తెలంగాణ ప్రభుత్వ కంపేటెంట్ అథారిటీ జారీచేసిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లేటెస్ట్ 'ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్'
➽ స్పోర్ట్స్ సర్టిఫికేట్
➽ దివ్యాంగులైతే SADAREM సర్టిఫికేట్
➽ వయోపరిమితి వర్తింపు కోసం ఎక్స్-సర్వీస్‌మెన్ సర్వీస్ సర్టిఫికేట్
➽ వయోపరిమితి వర్తింపు కోసం NCC ఇన్‌స్ట్రక్టర్ సర్వీస్ సర్టిఫికేట్
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.07.2024. (5 PM)
ALSO READ:
➥ 'టెన్త్' అర్హతతో 8326 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది