Biggest Veterinary Hospital In Hyderabad: భారతదేశంలోనే అతి పెద్ద వెటర్నరీ ఆస్పత్రి త్వరలో మన భాగ్యనగరంలో రాబోతోంది. నగరంలోని గగన్ పహాడ్‌లోని సత్యం శివం సుందరం గోశాల (మా సరస్వతి నగరం) వద్ద ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. దాదాపు 5,100 అడుగుల విస్తీర్ణంలోని ఆస్పత్రిలో.. ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), పశువులకు సంబంధించి అనేక రోగ నిర్ధారణ పరికరాలు, ప్రత్యేక వైద్యులు, సర్జన్లు, పశు వైద్య సిబ్బంది, మెడికల్ డిస్పెన్సరీ సదుపాయం కూడా అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధునిక డయాగ్నోస్టిక్స్‌తో పాటు ఎక్స్ రే యంత్రం, ఎండోస్కోప్, బ్లడ్ - ఇన్సులిన్ ఎనలైజర్, ఇతర సౌకర్యాలతో పాటు అంబులెన్స్ సదుపాయం కూడా ఉంటుందన్నారు. ఈ ఆస్పత్రిని జులై మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 


సత్యన్ శివం సుందరం గోవుల షెల్టర్ గగన్‌పహాడ్‌లో 3,200, బురుజుగడ్డ వద్ద 2,800 ఆవులకు ఆశ్రయం కల్పిస్తూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాలగా పేరొందింది. నగరంలోని రిటైర్డ్ స్వరణకారుడు ధరమ్ రాజ్ (85) 30 ఏళ్లుగా ఆవులను రక్షించే లక్ష్యంతో సేవలందిస్తున్నారు. నగరంలో అతి పెద్ద వెటర్నరీ ఆస్పత్రి ఆయన చిరకాల స్వప్నమని ఓ ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక పశు వైద్యశాలతో గగన్‌పహాడ్, బురుజుగడ్డలోని సత్య శివం సుందరం గోశాల వద్ద ఆశ్రయం పొందిన 6,000 ఆవులను సంరక్షించడమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి జంతువులకు కూడా సేవలను అందిస్తుందని వెల్లడించారు.


Also Read: Viral Video: వరదలో కొట్టుకుపోయిన పశువులు - చేపల కోసం ఎగబడ్డ జనం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దృశ్యాలు