Chandrababu released a white paper on the Polavaram project :  ఆరు వందల కోట్లు మిగిల్చానని చెప్పి వేల కోట్లకుపైగా నష్టాన్ని మిగిల్చారు. దీనికి ఎవర్ని బాధ్యులను చేద్దామని పోలవరం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఏపీకి జీవనాడిగా  చంద్రబాబు చెబుతున్న  పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన వైట్ పేపర్ ను చంద్రబాబునాయుడు ప్రకటించారు.   టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్జంలా సాగాయనdvejg.  అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని  ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశామన్నారు. నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందన్నారు.   గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు.  ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని.. అంత వేగంగా పనులు జరిగితే గత ఐదేళ్లలో అంతా రివర్స్ అయిందన్నారు. 


వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహమని పేర్కొన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టం ఎక్కువని వెల్లడించారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అహంభావంతో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి రివర్స్‌ టెండర్స్‌కు వెళ్లారని విమర్శించారు. జగన్‌ వల్ల డయాఫ్రంవాల్‌ దెబ్బతిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరంపై రూ. 11,762 కోట్లు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు.   టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు మొత్తంగా 71.20 శాతం, హెడ్ వర్క్స్ 64.08 శాతం, కుడి కాలువ 91.49 శాతం, ఎడమ కాలువ 71.60 శాతం పూర్తయ్యాయి.  ముంపు ప్రాంతానికి చెంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వాసితులు 1,05,601 గాను 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. 


జగన్ పాలన ఐదేళ్లలో  ప్రాజెక్టు మొత్తం వర్క్స్ 73.82 శాతంగా ఉంది. టీడీపీ హయాంలో 71.20 శాతం పోగా, జగన్ హయాంలో కేవలం 2.62 శాతం మాత్రమే పురోగతి జరిగింది.   ప్రాజెక్టు హెడ్ వర్క్స్ జగన్ హయాంలో 69.79 శాతంగా పేర్కొన్నారు. ఇందులో టీడీపీ హయాంలోని 64.08 శాతం తీసి వేస్తే జగన్ పాలనలో కేవలం 5.71 శాతం మాత్రమే పనులు జరిగాయి. కుడి, ఎడమ కాలువల పురోగతి, వాటి కనెక్టవిటీ కూడా అంతంత మాత్రమే. ఇక భూసేకరణ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది.
 


 ఐదేళ్లలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. నాడు 2019లో వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే పోలవరం పనులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు.  సైట్‌లో నిర్మాణ సంస్థ ఖాళీ చేయాల్సిందిగా జులై 29, 2019న నోటీసులు జారీ చేశారని, 2019 జులై 24న ఇచ్చిన పీటర్ కమిటీ రిపోర్టు ఆధారంగా రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని చంద్రబాబు విమర్శించారు.పోలవరంలో అవినీతే జరగలేదని కేంద్రం తేల్చిందని, డిసెంబర్ 02, 2019న స్వయంగా పార్లమెంట్‌లో స్పష్టంగా పేర్కొందన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా రూ.738 కోట్లు ఆదా అని ముందు గొప్పలు చెప్పారని, కానీ చివరకు డయాఫ్రం వాల్‌ను దెబ్బతీసి వేల కోట్ల నష్టం చేశారని చంద్రబాబ అసంతృప్తి వ్యక్తం చేశారు.  


 సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేత పత్రం విడుదల చేస్తామని, మొత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేస్తామని అన్నారు. వెబ్‌సైట్ల  ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్‌ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదలని స్పష్టం చేశారు.  కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే రాష్టంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాడుతో సవాళ్లు అధిగమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.