Weather Latest News: ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి మరాత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న దక్షిణ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. నిన్న దక్షిణ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం నుండి విదర్భ మరియు మరాత్వాడ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు మరియు రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.3 డిగ్రీలుగా నమోదైంది. 31 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: దక్షిణ మధ్యప్రదేశ్ మధ్యభాగాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడింది. ఏపీలో ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ లేదా నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.