Horoscope Today 27th April 2024 

మేష రాశి

రాశివారు అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కుటుంబ సభ్యులకు మీపై అంచనాలుంటాయి. అనవసర ఒత్తిడి పెరుగుతుంది.

వృషభ రాశి

వైవాహిక జీవితం బావుంటుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు.  శత్రువులపై విజయం సాధిస్తారు.  

మిథున రాశి

భవిష్యత్ లో మరింత ఎదిగేందుకు కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వస్తుంది. మీ  మాటతీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. కష్టమైన పనులను కూడా ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులకు మంచి సమయం. 

Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!

కర్కాటక రాశి

ఈ రాశి ఉద్యోగులకు శుభ సమయం. విద్యార్థులకు ఉన్నత చదువులకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు.  

సింహ రాశి

పాత సమస్యలు పరిష్కారమవుతాయి. న్యాయపరమైన విషయాల్లో కొంచెం ఆందోళన చెందుతారు. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. 

కన్యా రాశి 

ఈ రోజు శుభప్రదం. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో లాభపడటం వల్ల మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు సామాజిక సేవలో చాలా చురుకుగా ఉంటారు. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. ఈ రోజు మీకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

తులా రాశి

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బుపై అతి ఆశ పడొద్దు. బ్యాంకింగ్ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల నష్టపోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. 

వృశ్చిక రాశి 

ఈ రాశివారు విలాసాలను అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహాలను తప్పనిసరిగా పాటించండి. నూతన ప్రాజెక్టులో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రభుత్వం పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

ధనుస్సు రాశి

ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇతరులను ఎక్కువగా నమ్మవద్దు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈ రోజు అప్పులు చేయవద్దు. మీ మాటలు ఎదుటివారికి చెడుగా అర్థమవుతాయి. ప్రియమైన వారిపట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. 

Also Read: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!

మకర రాశి

మీకు ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం  ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉన్నత చదువులపై ఆసక్తి పెరుగుతాయి. ప్రయాణాలలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతాయి. ఉద్యోగులకు శుభసమయం

కుంభ రాశి 

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ఆలోచనలు వస్తాయి.ప్రేమ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు తమ చదువుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. సహోద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

మీన రాశి

చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండండి. వ్యాపారులకు అనుభవజ్ఞుల సహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...