Weather Latest News: నిన్న మధ్య బంగాళాఖాతంలో  కేంద్రీకృతమైన వాయుగుండం ఈశాన్య దిక్కులో కదిలి ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ దిశలో కదులుతోంది. ఈ వాయుగుండం ప్రభావం ఇక తెలంగాణపై లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


నైరుతి ఋతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఈరోజు విస్తరించినవి. రాగల 24 గంటలలో ఋతుపవనాలు నైరుతి బంగాళాఖతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి విస్తరించ డానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నవి. ఆగ్నేయ రాజస్థాన్  వద్ద నున్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో కింద స్థాయి గాలులు ప్రధానంగా పడమర / వాయువ్య దిశల నుండి వీస్తున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):


ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు   అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. 
ఎల్లుండి రాష్ట్రం లో పొడి వాతావరణం ఏర్పదే అవకాశము ఉన్నది.


వాతావరణ హెచ్చరికలు  (weather warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు,  మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ. వేగంతో  వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. 64 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మే 25న విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.