Weather Latest News: జూలై 24న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆగ్నేయ వైపు వంగి వున్న ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, గ్వాలియర్, సిద్ది, డాల్టన్ గంజ్ గుండా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, దక్షిణ - పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. 85 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘నిన్నటి షీర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు దాదాపు 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5, 7.6 కిలో మీటర్ల మధ్య ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. ఇంకా ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి’’ అని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
జూలై 24న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.