IOCL Non-Executive Recruitment 2024: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 467 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో ఐవోసీఎల్ ప్లాంట్లలో 400 పోస్టులు, పైప్ యూనిట్లలో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 22న ప్రారంభంకాగా.. ఆగస్టు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. 

ఖాళీల వివరాలు..

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 467 (ప్లాంట్స్-400, పైప్స్ యూనిట్స్-67 పోస్టులు)

1) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 198 పోస్టులువిభాగం: ప్రొడక్షన్. అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/పెట్రో కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ/రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్) లేదా బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

2) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 33 పోస్టులువిభాగం: పీ అండ్ యూ. అర్హత: మూడేళ్ల డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా రెండేళ్ల ఐటీఐ(ఫిట్టర్) (లేదా)  బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

3) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 22 పోస్టులువిభాగం: పీ అండ్ యూ, ఓ అండ్ ఎం (P&U-O&M).అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

4) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 25 పోస్టులువిభాగం: ఎలక్ట్రికల్. అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

5) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 50 పోస్టులువిభాగం: మెకానికల్. అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతి అర్హతతో రెండేళ్ల ఐటీఐ(ఫిట్టర్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

6) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులువిభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్. అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

7) జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్: 21 పోస్టులువిభాగం: క్వాలిటీ కంట్రోల్.అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

8) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 27 పోస్టులువిభాగం: ఫైర్ అండ్ సేఫ్టీ. అర్హత: పదోతరగతితోపాటు NFSC-నాగ్‌పూర్ నుంచి 'సబ్ ఆఫీసర్స్' కోర్సు లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ప్రొఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 10.09.2024.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబరులో.

➥ ఫలితాల వెల్లడి: అక్టోబరు మూడో వారంలో.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..