Weather Latest News: నిన్నటి ద్రోణి / గాలి విచ్ఛిన్నతి  ఈరోజు దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి విదర్భ, మరాత్వాడ - అంతర్గత కర్ణాటక వద్ద కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం మీదుగా దక్షిణ కేరళ వరకు సగటు  సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.


తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38.8 డిగ్రీలు, 27.3 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 5 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3 డిగ్రీలుగా నమోదైంది. 49 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 


ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.