Rajasthan Royals won by 9 wkts: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ముంబయితో సొంతమైదానంలో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. . తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.4 ఓవర్లలోనే మరో 8 బాల్స్ ఉండగానే ఛేజ్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్ యశస్తి జైశ్వాల్ సెంచరీతో విజృంభించాడు. . కెప్టెన్ సంజూ శాంసన్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దాంతో, ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది.
ముంబై పడుతూ... లేస్తూ..
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలోనే దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అయిదు బంతుల్లో ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మను బౌల్ట్ అవుట్ చేసి ముంబైకు తొలి షాక్ ఇచ్చాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే ముంబైకు మరో షాక్ తగిలింది. మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. కిషన్‌ను సందీప్ శర్మ అవుట్ చేశాడు.
ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ వేసిన 1.3 ఓవర్‌కు వికెట్ కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. రాజస్థాన్ డీఆర్‌ఎస్ తీసుకుకోవటంతో అది అవుట్ గా డిక్లేర్ అయ్యింది. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు. ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లతో పది పరుగులు చేసిన సూర్యాను సందీప్ శర్మ అవుట్ చేశాడు. దీంతో 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ నబీ కూడా 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
యశస్వీ అజేయ సెంచరీ..
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. ముంబై బౌలర్లు.. రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం పీయూష్ చావ్లా ఒక్కడే.. ఒక్క వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీ య్యాకపోవడంతో రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. స్ట్రాటజిక్ టైమ్‌లో వర్షం పడడంతో అంపైర్లు కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి రాజస్థాన్ స్కోర్ 61/0.
జైస్వాల్ 7 సిక్సులు, 6 ఫోర్ల తో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన భాగస్వామిగా సంజూ శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. బట్లర్ 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టుకి ఇది 5వ విజయం కాగా, ముంబైకి మూడో ఓటమి.
జైస్వాల్ 7 సిక్సులు, 6 ఫోర్ల తో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన భాగస్వామిగా సంజూ శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. బట్లర్ 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టుకి ఇది 5వ విజయం కాగా, ముంబైకి మూడో ఓటమి.