IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్‌, ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడుగా యుజీ!

Yuzvendra Chahal Record: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మొద‌టి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

Continues below advertisement

Yuzvendra Chahal Record: రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌(Yuzvendra Chahal )అరుదైన  రికార్డ్ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా  నిలిచాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా జైపూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో నబీని ఔట్‌ చేసిన చాహల్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబైతో మ్యాచ్‌తో క‌లిపి చాహ‌ల్ ఇప్పటికీ  152 మ్యాచులు ఆడాడు. 7.70 ఎకాన‌మీతో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా చాహ‌ల్ కొన‌సాగుతున్నాడు.  ఈ జాబితాలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు డ్వేన్ బ్రేవో 183 వికెట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

Continues below advertisement

ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన  బౌల‌ర్లు వీరే..

యుజ్వేంద్ర చాహల్ – 200 వికెట్లు
డ్వేన్ బ్రావో – 183 వికెట్లు
పీయూష్ చావ్లా – 185
అమిత్ మిశ్రా – 173
భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 173
వీరి తరువాత 172 వికెట్లతో ర‌విచంద్ర‌న్ అశ్విన్,  అనంతరం  డ్వేన్ బ్రావ‌క్ష   , ల‌సిత్ మ‌లింగ  , సునీల్ న‌రైన్  , ర‌వీంద్ర జ‌డేజా  , జ‌స్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. కాగా, ఈ సీజన్ లో చాహల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీశాడు.

ఐపీఎల్​లో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. యూజీ  రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్​గా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో చాహల్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 2008- 2011 మధ్య నాలుగు సీజన్​లపాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 55 మ్యాచ్​లు ఆడిన వార్న్ 7.27 ఎకనమీతో 57 వికెట్లు పడగొట్టాడు. చాహల్ ఈ రికార్డును  గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్​లో 2 వికెట్లు తీసిన చాహల్ ఈ ఫీట్ అందుకున్నాడు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. 

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌  తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ముంబై.. తిలక్‌ వర్మ, నెహల్‌ వధేరా పోరాటంతో  195 పరుగుల స్కోరు చేసింది. బ్యాటర్లందరూ పెవిలియన్‌కు వెనుదిరిగుతున్నా తిలక్‌వర్మ.. నెహల్‌ వధేరా పోరాడారు. సందీప్‌ శర్మ అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.

Continues below advertisement