Weather Latest News: జూలై 20న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఒడిశా మరియు పరిసర ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయువ్య మరియు పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈరోజు ఒడిశా తీరం వద్ద చిలికా సరస్సు అనగా 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది.
ఋతుపవన ద్రోణి ఈరోజు జైసాల్మయిర్, అజ్మీర్, మాండ్ల, రాయిపూర్ మరియు ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం గుండా వెళుతూ తూర్పు-మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నది.
గాలి విచ్చిన్నతి ఈరోజు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉన్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల, రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు మెరుపులుతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
నేడు ఎల్లో అలర్ట్
నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిసార్లు మెరుపులు, ఈదురుగాలులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో సంభవించే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 - 12 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2 డిగ్రీలుగా నమోదైంది. 93 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్ప పీడనం గత 3 గంటల్లో ఆచరణాత్మకంగా స్థిరంగాఉంది. జూలై 20 ఉదయం 8.30 నాటికి పూరీకి నైరుతి, గోపాల్ పూర్ కి తూర్పు -ఈశాన్యంగా 70 కిలో మీటర్ల వద్ద ఉంది. ఇది మరింత వాయువ్య దిశగా కదిలి వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీన పడి అల్ప పీడనంగా మారుతుంది’’ అని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
జూలై 20న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.