10 Health Benefits Of Drinking Fenugreek Water Empty Stomach: చాలామంది మెంతులను చూస్తే వామ్మో అంటారు. చేదుగా ఉంటాయి తాగం బాబోయ్ అంటుంటారు. కానీ, మెంతుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. మెంతులు నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఆ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, అంతేకాకుండా కళ్లకి, జుట్టుకి అన్నింటికి మంచిదని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్ మరి ఎలా తాగాలి? మెంతులను నానబెట్టిన నీటిని తాగితే కలిగే లాభాలు ఏంటి? తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఎలా తయారు చేయాలి..
మెంతులు త్రిగోనిల్లా ఫోయినమ్ గ్రేసమ్ ప్లాంట్స్ నుంచి తీస్తారు. దాంట్లో చాలా ఔషధాలు ఉంటాయి. అందుకే, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మెంతులను ఒక గ్లాస్ లేదా బాటిల్ అంటే 250- 500 ఎమ్ ఎల్ నీళ్లలో వేసి 8 గంటల పాటు నానబెట్టి తాగితే చాలామంచిది.
ఎందుకు నానబెట్టాలి?
గింజలు ఏవైనా నీళ్లలో నానబెడితే వాటిల్లోని బయో యాక్టివ్ కాంపౌండ్స్, సాల్యుబుల్ ఫైబర్స్, సాపోనిన్స్, ఫ్లావనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ని నీటిలో కరిగేలా చేస్తాయి. ఆ పోషకాలన్నీ నిటిలోకి వస్తాయి. అలానే మెంతులు కూడా. అందుకే మెంతులు నానబెట్టిన నీళ్లను తాగాలని చెప్తున్నారు డాక్టర్లు.
ఆ నీటిని డైరెక్ట్ గా తాగొచ్చు లేదా హెర్బల్ టీ, స్మూథీస్, లాంటి వాటి వాటితో కలిపి తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల షుగన్ కంట్రోల్ అవుతుందని, ఇంకా చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం.
జీర్ణం బాగా అవుతుంది..
మెంతులు నానబెట్టి ఆ నీటిని తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. దానివల్ల గ్యాస్ సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా కాన్ స్టిపేషన్ ఇబ్బందులు తలెత్తవు.
వెయిట్ లాస్..
మెంతుల్లో ఉంటే ఫైబర్ కంటెంట్ వెయిట్ లాస్‌కు ఉపయోగపడుతుంది. క్యాలరీలను కరిగించడంలో దోహదపడుతుంది. మెటబాలిజమ్ ని బూస్ట్ చేస్తుంది.
బ్లడ్ షుగర్ రెగ్యులేషన్..
మెంతులు నానబెట్టి ఆ నీటిని తాగితే.. షూగర్ కంట్రోల్ లో ఉంటుంది. దాంట్లోని ఫైబర్, కాంపౌండ్స్ షుగర్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
హార్ట్ హెల్త్..
మెంతులు కొలస్ట్రాలను కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలస్ట్రాలను కరిగించేస్తుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్..
మెంతుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. అవి జాయింట్ పెయిన్స్ లాంటివి రాకుండా చేస్తాయి. బ్యాలెన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది.
చర్మానికి మంచిది..
మెంతులు నానబెట్టిన నీళ్లు బాడీని డీ టాక్సిఫై చేస్తాయి. దీంతో యాక్నే తగ్గుతుంది. ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించి పగ్గుళ్లను నివారిస్తుంది.
రుతుక్రమంలో నొప్పి నుంచి ఊరట..
నెల నెల పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని మెంతులు తగ్గిస్తాయి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి, నొప్పి, బ్లోటింగ్ లాంటివి రాకుండా చేస్తుంది.
పాలు పడేందుకు..
మెంతులు బాలింతల్లో పాలు పడేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు బిడ్డకి ఔషధ విలువలు కూడా అందుతాయి.
జుట్టుకి మంచిది..
మెంతులు జుట్టుకి కూడా చాలా బలాన్ని ఇస్తాయి. ప్రొటీన్, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ లాస్ అవ్వదు. జుట్టు పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్..
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్లావనాయిడ్స్, పాలీ ఫినాయిల్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి సెల్స్ ని కాపాడతాయి. ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
Also Read: నిద్ర ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా పడకేస్తున్నారా? ఈ జబ్బులు గ్యారంటీ!