Weather Latest News: ఆవర్తనం ఒకటి కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని చెప్పారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 


ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)


ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాలలో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన  తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.3 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నవ్ సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్ గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ నుంచి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (జూన్ 19) ఓ ప్రకటనలో తెలిపారు. 


నైరుతి రుతుపవనాలు మరో 2 నుంచి 3 రోజుల్లో మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన భాగాలు, బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో, జార్ఖండ్ లోనూ మరింత ముందుకు సాగడానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి.


అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.