Weather Latest News: ఆవర్తనం ఒకటి రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కింది స్థాయిలోని గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి. మి వేగంతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మి వేగంతో కూడిన తేలికపాటి నుండి మెస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణలోని నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నవ్ సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్ గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ నుంచి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు మరో 3 నుంచి 4 రోజుల్లో మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన భాగాలు, బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో, జార్ఖండ్ లోనూ మరింత ముందుకు సాగడానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి.
అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలుల వల్ల గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.