Weather Latest News: నైరుతి ఋతుపవనాలు జూన్ 12వ తేదీన తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 


ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)


ఈరోజు భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో కూడిన  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జూన్ 13న తెలంగాణలో ఎలాంటి హెచ్చరికలను వాతావరణ కేంద్రం జారీ చేయలేదు.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. 79 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: విశాఖకి తూర్పు భాగాన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని వలన రాయలసీమ జిల్లాల్లో రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 12న మధ్యాహ్నం - సాయంకాలం సమయాల్లో కర్నూలు, నంద్యాల​, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, కడప​, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు అక్కడక్కడ పడ్డాయి. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కాకినాడ జిల్లాల్లో చెదురుముదురుగానే వర్షాలను చూడగలము. ఈ జిల్లాల్లోని కొండ ప్రాంతాలకే నేడు వర్షాలు పరిమితం అవనున్నాయి.


ఉత్తర కోస్తాలో తేలికపాటి రాబోయే మూడు రోజులు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలుల వల్ల గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.