Weather Latest News: ఆగస్టు 12న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆవర్తనం ఒకటి ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కొనసాగుతుంది. ద్రోణి ఒకటి రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 
ఈరోజు, రేపు, ఎల్లుండి  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.9 డిగ్రీలుగా నమోదైంది. 96 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. 


ఆగస్టు 12న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.