Weather Latest News: సెప్టెంబరు 10న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో పూరి కి (ఒడిశా ) తూర్పు - ఆగ్నేయ దిశలో 50 కి. మీ. దూరంలో కేంద్రకృతమైన తీవ్ర వాయుగుండం నిన్న ఉదయం 1030 - 1130 గం.ల మధ్య ఒడిశా లోని పూరికి దగ్గరగా తీరం దాటింది. ఇది వాయుగుండంగా మారి ఈరోజు ఉదయం 0830 గం.లకు ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ - వాయువ్య దిశలో కదులుతూ ఈరోజు సాయంత్రానికి బలహీనపడి ఛత్తీస్‌గఢ్, పరిసర తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా మారే అవకాశం వుంది.
ఋతుపవన ద్రోని ఈరోజు బికానర్, కోట, గుణ, ఉమారియ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం యొక్క కేంద్రం నుండి మరియు పూరి గుండా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కొనసాగుతుంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 29 నుంచి 24 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 26.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. 84 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఉత్తర చత్తీస్ గఢ్, దానిని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశాపై గల వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కిలో మీటర్ల వేగంతో కదిలి గడిచిన 6 గంటల్లో ఏ రోజు అనగా 10వ తేదీన గంటలకు ఉత్తర ఛత్తీస్ గఢ్ పై 70 కిలో మీటర్ల బిలాస్ పూర్ కు తూర్పు ఆగ్నేయంగా 140 కిలో మీటర్లు, రాయ్ పూర్ కు, మలాంజ్ ఖండ్‌కు 22 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, ఉత్తర ఛత్తీస్ గఢ్ అదే ప్రాంతంలో 10వ తేదీ నాటికి బలహీనపడి తీవ్ర అల్ప పీడనంగా మారుతుంది.
ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.