Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి మధ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడిందని అధికారులు తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):


ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. 


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)


ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ., ఎల్లుండి  40 - 50 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)


ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.


ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 11న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు గంటకు 4 - 8 కిలో మీటర్ల నుంచి 04 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగా నమోదైంది. 65 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వరకు ఉన్న ద్రోణి నేడు బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపారు. 


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.