నిద్రలో కలలు రావడం సాధారణమే. అయితే వచ్చే ప్రతి కల గుర్తుండదట. గుర్తున్న ప్రతి కలకు ఒక కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కల గుర్తుందంటే దాని వెనుక ఏదో సందేశం ఉంటుందట. కలలో పరిచయం లేని మఖాలు కనిపిస్.. అది ఎలాంటి పరిస్థితికి సంకేతమో.. స్వప్నశాస్త్రంలో ఏమని చెప్పారో తెలుసుకుందాం.
కలలో తెలియని ముఖాలు తరచుగా కనిపిస్తున్నాయంటే మీ మీద ఏదో శక్తి పనిచేస్తుందని అర్థం. అది సానుకూలమైనది కావచ్చు, లేదా ప్రతికూల శక్తి కూడా కావచ్చు.
తెలియని ప్రదేశంలో..
కలలో ఎప్పుడూ చూడని ప్రదేశంలో.. అసలు పరిచయం లేని వ్యక్తి కనిపిస్తే శుభప్రదమని స్వప్నశాస్త్రం వివరిస్తోంది. ఈ కలకు అర్థం త్వరలో మీరు పర్యటనకు వెళ్ల బోతున్నారని అనడానికి సంకేతమట. అంతేకాదు మీరు చిరకాలంగా ఆశిస్తున్న కోరికేదో తీరబోతందని కూడా ఈ కల సూచిస్తుందట.
మాట కలిపితే..
పరిచయం లేని వ్యక్తితో సంభాషిస్తున్నట్టు కలొస్తే మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారనేందుకు సంకేతమట. మీ సోషల్ సర్కిల్ చాలా చిన్నదిగా ఉందని అర్థమట. ఇలాంటి వారికి స్నేహితులు చాలా తక్కువ. ఈ కల మీరు మనసులో మాట బయటికి చెప్పేందుకు సంకోచిస్తున్నారని కూడా సూచిస్తుందట. ఇలాంటి కల తరచుగా వస్తుంటే మీలోని కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలని చెప్పేందుకు సూచనగా భావించాలి.
బహుమతి తీసుకుంటే..
ఎవరో తెలియని వ్యక్తులు కలలో మీకు బహుమతులు ఇస్తున్నట్టయితే అది మంచి కలగా భావించాలి. ఈ కల మీకు త్వరలో కలిగే లక్ష్మీ కటాక్షానికి సంకేతమట. ఏదో ఆర్థిక లాభం కలుగుతుంది. లేదా అత్యంత శుభవార్త ఏదో త్వరలో వినబోతున్నారని ఈ సూచిస్తుంది.
ఫాలో చేస్తే?
ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని ఫాలో చేస్తున్నట్టు కలొస్తే ఆ కల కచ్చితంగా భయపెడుతుంది. ఇలా భయం గొలిపే కల వచ్చిందంటే మిమ్మల్ని ఏదో చింత వేధిస్తోందని అర్థం. మీకు పరిష్కారం లభించని సమస్యలేవో ఉన్నాయని అనేందుకు సంకేతం. ఇలాంటి కల వస్తే ఏ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయో, దేన్ని తలచుకుని మీరు భయపడుతున్నారో పరిశీలించి తెలుసుకుని పరిష్కరించుకోవడం అవసరం.
ఇంట్లోకి వస్తే?
ఎప్పుడూ పరిచయం లేని వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చినట్టు కల వస్తే ఇది మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు సూచనగా భావించాలి. మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అర్థం. అది మంచి కావచ్చు. ఒక్కోసారి చెడు కూడా కావచ్చు.
మరణించిన కల
మీకు పరిచయంలేని వ్యక్తి మీ కలలో మరణించినట్టు కనిపిస్తే మీకు తెలియకుండా మీలో ఏదో అనారోగ్యం ఉందని అర్థం. ఇలాంటి కల వచ్చిన వారు తప్పకుండా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
తరచుగా కనిపిస్తే?
తరచుగా మీకు కలలో అపరిచితులు కలలో కనిపిస్తే మీకు ఏదో ప్రత్యేక అనుభవం ఎదురుపడబోతోందనేందుకు సకేంతం. అది మీరు జీవితంలో ఇది వరకెపుడు ఎదుర్కోని పరిస్థితిలో మీరు ఉండబోతున్నారని అని అర్థమట.
Also Read : Baba Vanga: బాబా వంగ భవిష్యవాణి - ఈ పెద్దావిడ చెప్పినవన్నీ 2024లో నిజమైపోతున్నాయ్, మిగతా నెలల్లో ఈ దారుణాలు జరుగుతాయా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.