బాబా వంగా చెప్పే జోస్యం చాలా వరకు నిజమవుతుంది. అందుకు, ప్రపంచంలో చాలామంది ఆమె భవిష్యవాణిని నమ్మతారు. ఈ ఏడాది కూడా చాలా అంశాలు.. ఆమె చెప్పినట్లే నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన భయానక అంశాలు కూడా వాస్తవమైతే పరిస్థితి ఏమిటనే బెంగ పట్టుకుంది.


బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించారు. 1996లో 86 సంవత్సరాల వయసులో ఆమె మరణించారు. బాబా వంగా బాల్యంలోనే చూపు కోల్పోయారు. కానీ ఆమె మనోనేత్రం మాత్రం భవిష్యత్ దర్శనం చెయ్యగలిగింది. ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమైంది.ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమైంది. అయితే ఆమెకు జ్యోతిషం ఏమాత్రం తెలియదని చెప్పటం విశేషం.


ఆమె తన జీవితకాలంలోనే 5079 సంవత్సరం వరకు జరగబోయే భవిష్యవాణి మొత్తాన్ని తన శిష్యులకు చెప్పారట. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. 2024 గురించి కూడా చాలా విషయాలు చెప్పారట. అవన్నీ నిజమైతే ప్రపంచం వినాశనం దిశగా పయనిస్తున్నట్టే. 2024 సంవత్సరానికి గాను ఆమె అసలు ఏం చెప్పారు? ఇప్పటి వరకు ఆమె చెప్పిన వాటిలో నిజమైనవి ఎన్ని విషయాలు? వంటి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. 


ఆర్థిక సంక్షోభం


2024 సంవత్సరంలో ప్రపంచం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుందని బాబా వంగా చెప్పారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. పశ్చిమం నుంచి తూర్పుకు అధికార మార్పు జరగవచ్చు. ఈ కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి రావచ్చు. చైనా ఇప్పటికే ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి.


గ్లోబల్ వార్మింగ్


గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూ ఉపరితలం మీద వేడి తీవ్రమవుతుంది. 2024లో ఈ వేడి వల్ల వాతావరణ ప్రతికూలతలు వేధించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎండలు చూస్తుంటే.. ఆమె చెప్పింది నిజమే అనిపిస్తోంది. 


సైబర్ దాడులు


ప్రపంచంలో సైబర్ దాడులు చాలా పెరిగిపోతాయని బాబావెంగా చెప్పారు. చాలా పేరుమోసిన కంపెనీలు సైతం హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. దేశంలోని రక్షణ సంస్థలు కూడా హ్యాకర్లకు టార్గెట్‌గా మారాయి. సైబర్ హ్యాకర్లు పవర్ గ్రిడ్లు, నీటి వనరుల పైన దాడి చెయ్యవచ్చట.


జీవాయుధాల పరీక్ష


ప్రపంచంలోని అతి పెద్ద దేశం 2024లో జీవ ఆయుధాలను పరీక్షిస్తుందని బాబా వంగా భవిష్యవాణిలో చెప్పారు. ఇదే నిజమైతే లోకంలో అల్లకోల్లలం జరుగుతుంది.


ఇప్పటి వరకు నిజమైన బాబా వంగా భవిష్య వాణిలో కొన్ని విషయాలు:


బాబా వంగా డయాన మరణం నుంచి 9/11 ఉగ్రవాద దాడులు, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కావడం వరకు చాలా విషయాలను అంచనా వేశారు. అవన్నీ నిజమయ్యాయి. భూకంపాలు, సునామి వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం అంచనా వేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలు వరదలను ఎదుర్కోవడాన్ని కూడా బాబా వంగా భవిష్యవాణిలో వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పైవన్నీ కూడా జరిగితే విధ్వంసం తప్పదు. 


Also read : Amarnath Yatra 2024: అమర్నాథ్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ తేదీల్లో వెళ్లేందుకు ప్లాన్ చెయ్యండి




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.