Weather Latest News: ఆగస్టు 31న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం  పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారి ఈరోజు ఉదయం 5 గంటల గంటల 30 నిమిషాలకు అదే ప్రాంతంలో  కేంద్రీకృతమై ఉంది.  ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఆంధ్ర తీరం మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కలింగపట్నానికి సమీపంలో ఈరోజు 31 ఆగస్టు అర్ధరాత్రి సమయానికి తీరం దాటే అవకాశం ఉంది.


ఋతుపవన ద్రోణీ ఈరోజు సగటు సముద్రమట్టం నుండి పాకిస్తాన్ తీరం సమీపంలోని ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలోని తీవ్ర తుఫాను యొక్క కేంద్రం నుండి జలగం బ్రహ్మపురి జగదల్పూర్ కళింగపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం యొక్క కేంద్రం వరకు విస్తరించింది.       


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు  తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు    అనేక చోట్ల , మరియు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది


వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ, భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ  వర్షాలు కొన్నిచోట్ల ,  కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు  తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో చాలచోట్ల , మరియు  ఎల్లుండి గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాhశం వుంది.


భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.7 డిగ్రీలుగా నమోదైంది. 78 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: పశ్చిమ మధ్య, ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి ఆగస్టు 30న ఉదయం 8.30 గంటలకు ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారింది. ఇది వచ్చే 36 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుంది. 


సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇపపుడు లోతైన అల్ప పీడన కేంద్రం కచ్ తీరం, పాకిస్థాన్, ఈశాన్య అరేబియా సముద్రం, మాలెగావ్, బ్రహ్మపురి పరిసర ప్రాంతాలు, జగదల్ పూర్, కళింగపట్నం గుండా, ఆపై ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య, ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం వద్ద గల అల్పపీడనం నుంచి వెళ్తుంది.


ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.