Warangal Crime News: లక్షకు నాలుగు రెట్లు అధికంగా డబ్బు ఇస్తామని నకిలీ నోట్ల చెలాణి చేసే ఎనిమిది మంది ముఠా సభ్యులను వరంగల్ కమిషనరేట్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 38 లక్షల 84 వేల రూపాయల ఒరిజినల్ కరెన్సీ, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో,తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అడవిలో డబ్బులు డ్రమ్ కథలు
పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే అదాయం సరిపోవడం లేదని ఈజీ మనీపై కన్నేశాడు. గొర్రెల వ్యాపారం ద్వారా పరిచయమైన వారికి అడవిలో డబ్బుల డ్రమ్ము దొరికిందని కథలు చెబుతూ వచ్చాడు. ఆ డబ్బు వినియోగిస్తే తన కుటుంబానికి ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు ఎదురౌవుతున్నాయని నమ్మించేవాడు.
ఈ డబ్బును ఎవరైన ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఖహానీలు చెప్పేవాడు. ఒక లక్ష రూపాలు ఇస్తే దొరికిన డబ్బు నుంచి డబుల్ ఇస్తానని, ఒక లక్ష ఇస్తే నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహలో కృష్ణకు హనుమకొండ జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్ జత కలిశాడు.
Also Read: మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అడవిలో నకిలీ నోట్లతో ఫేక్ డ్రమ్ సెటప్
ఇద్దరు కలిసి ఖమ్మం జిల్లా పాల్వంచ అడవిలో ముందుగా అసలు, నకిలీ నోట్లతో భద్రపర్చిన డ్రమ్ము చూపించాడు. ఐదు వందల రూపాయాల నోట్ల కట్టలను చూపించడంతో అవి అసలు నోట్లని నమ్మిన శ్రీనివాస్ పదిలక్షలు ఇచ్చాడు. దీనికి కృష్ణ ఇరువై లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. డబ్బును హనుమకొండ తీసుకువచ్చి ఇవ్వాలని శ్రీనివాస్ కండిషన్ పెట్టాడు.
ఇద్దరు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కృష్ణ మరో నలుగురితో కలిసి కారులో హనుమకొండవచ్చాడు. ఈనెల 24న కేయూసి ఔటర్ రింగ్‌రోడ్డు పెగడపల్లి క్రాడ్ రోడ్డు నోట్ల మార్పిడీకి స్పాట్ నిర్ణయించారు. అసలు డబ్బుతోపాటు నకిలీ నోట్ల మార్పిడి జరుగుతున్న టైంలో పెట్రోలింగ్ పోలీసులు అటుగా వచ్చాు. నిందితులు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొన్నారు.
వారి వద్ద ఉన్న బ్యాగులు, కారులో తనిఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదు, నకిలీ నోట్లు, ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలు గుర్తించారు. వారిని అదుపులోని తీసుకోని విచారించగా నిందితులందరు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు ఇదే తరహలో మరో మిత్రుడితో కలిసి తెల్ల కాగితాలపై ఐదు వందల రూపాయల నోటు ముద్రించి విక్రయించాడు. పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వి.యం.బంజర, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్‌ల్లో కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం