BRS News: అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కలకలం రేపుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు బీఅర్ ఎస్ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకరు ఎమ్మెల్సీ అయితే... మరొకరు ఎమ్మెల్యే. అంతేకాదు ఇద్దరిలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు అత్యంత సన్నిహితులైతే, ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్లోజ్‌. మిత్రుడు కూడా. అయితే జనగామ నియోజకవర్గంలో పాగా వేయడం కోసం వీరిద్దరి మధ్య ఆధిపత్యం పోరుకు దారితీస్తుంది.


ఆధిపత్య పోరుకు వేదిక జనగామ.
జనగామ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ రగడ కొనసాగుతుంది. జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుంది. వీరి ఇద్దరి మధ్య వివాదం 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి కొనసాగుతుంది. ఎమ్మెల్సీగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి జనగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అందుకు పార్టీ అధిష్టానం నుండి పోచంపల్లికి సానుకూలమైన సంకేతాలు వచ్చాయి. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఒకటి అధిష్టానం అభ్యర్థి మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నువ్వా నేనా అని పోటీపడుతున్న సమయంలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరపైకి వచ్చారు. అంతేకాదు పల్లా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడంతో ఇటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి షాక్‌కు గురయ్యారు. 2023 ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్‌లోనే ఉంటూ పార్టీ పరువును కాపాడుతున్నారు.



2023 ఎన్నికల నాటి నుంచి ఆధిపత్య పోరు
2023 ఎన్నికల ముందు నుంచి వల్ల రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాత్రం జనగామపై దృష్టి పెట్టారు. భవిష్యత్ రాజకీయాల కోసం జనగామ వేదికగా చేసుకోవడానికి పోచంపల్లి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు జనగాం నియోజకవర్గంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తిరుగు మద్దతుదారులను, అభిమానులను కాపాడుకుంటున్నారు. ఇదే ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాస్ రెడ్డి అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పల్లా ఫోటో కూడా ఉంటుంది. అయితే ఏర్పాటు చేసిన అర్ధరాత్రి ఫ్లెక్సిని ఉండదు. ప్లెక్సీని పల్లా రాజేశ్వర్ రెడ్డి లేకుండా చేశారని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల ఆరోపణ. దీంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది.


కేసీఆర్‌కు పల్లా ... కేటీఆర్‌కు పోచంపల్లి అత్యంత సన్నిహితులు
ఇద్దరు నేతలు టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితులు.  కెసిఆర్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నితంగా ఉంటే, కేటీఆర్‌కు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మిత్రుడు, సన్నిహితుడు. కేటీఆర్ ఆశీస్సులతో పోచంపల్లి రెండు సార్లు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైతే. కేసీఅర్ ఆశీస్సులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిద్దరి మధ్య ఎప్పుడు వివాదం నెలకొన్న ఇద్దరు అధినేతలు రంగంలోకి దిగుతారు. ప్లెక్సీ పంచాయతీ కూడా అధినేతల వద్దకు చేరిందట. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆధిపత్య పోరు ఎందుకని ఇద్దరికీ సర్డిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Also Read: పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!