Sammakka Saralamma Tribal Museum: ఆదివాసి గిరిజనుల జీవనశైలి, వారు వాడిన వస్తువుల కలబోత మేడారంలోని గిరిజన మ్యూజియం. మేడారంలోని గిరిజన మ్యూజియం జాతరకు వచ్చిన భక్తులను అబ్బుర పరుస్తున్నాయి. ఈ మ్యూజియం గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.


ములుగు జిల్లా మేడారం కుగ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ఆదివాసి సాంప్రదాయాలను చూస్తాం. వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు జీవన విధానంలో వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది మేడారంలోని గిరిజన మ్యూజియం. మేడారం జాతర ప్రాంతంలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2018లో గిరిజన మ్యూజియం ను ఏర్పాటు చేయడం జరిగింది. రెండు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియం గిరిజనుల జీవనం శైలిని ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది. మ్యూజియంలోకి వెళ్లగానే మొదట ఆదివాసి వీరుడు కొమరం భీమ్ విగ్రహం కనిపిస్తుంది. తర్వాత మేడారం గిరిజన వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలను ప్రతిబింబిస్తుంది. 




అడవిలో అమ్మవార్లు చిలకలగుట్ట తోపాటు అమ్మవారికి ఎత్తు బంగారం రూపంలో సమ్మర్పించే తులాభారం, మరోవైపు దేవతల జెండాలు కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఆదివాసి గిరిజనుల వందల సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు అంతేకాకుండా ఆదివాసి గిరిజనులు అడవిని నమ్ముకొని జీవనం సాగించేవారు. కాబట్టి వేట కోసం వాడిన విల్లంబులు, బాణాలు, బరిసెలు ఇతర వేట వస్తువులు మనకు కనిపిస్తాయి. మరోవైపు పండుగ వేళల్లో ధరించే వేషధారణ సంబంధించిన దుస్తులు, డోలు వాయిద్యాలు  సైతం మ్యూజియంలో భద్రపరిచారు. అడవిలో దొరికే వివిధ రకాల చెట్లు వాటి వేర్లను సైతం సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచారు. అంతేకాకుండా గిరిజనులు అలంకరణలో ఉపయోగించే చేతి కడియాలు, వడ్డానం కాళ్ళ కడియాలు, తదితర అలంకరణ వస్తువులు ఇక్కడ కనువిందు చేస్తాయి. మరోవైపు గిరిజనులు సంతోష, పండుగ సమయాల్లో గుంపులు గుంపులుగా చేసే నృత్యాలు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 


ఫస్ట్ ఫ్లోర్ లో ఫోటో గ్యాలరీ
ఇక మ్యూజియంలోని మొదటి అంతస్తులో పూర్తిగా ఫోటో గ్యాలరీ కోసం ఏర్పాటు చేశారు. గిరిజనుల జీవన శైలికి సంబంధించిన గిరిజనులు వంట చేసుకోవడం, అడవికి వెళ్లడం, పశువులను తీసుకువెళ్లడం, వేట తదితర ఫోటోలు కనిపిస్తాయి. మరోవైపు మేడారం జాతరకు సంబంధించిన వన దేవతల ఫోటోలు గద్దెల వద్ద భక్తుల సందడి తోపాటు ఎడ్లబండ్లపై వచ్చే భక్తుల ఫోటోలు, శివశక్తుల పూనకాలు ఏర్పాటు చేశారు. 1980 కి ముందు ఫోటోలు సైతం కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మ్యూజియంలో గిరిజనుల జీవనశైలి మేడారం సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన చరిత్ర ఆడియో, వీడియో రూపంలో వినిపించడానికి సైతం ఏర్పాటు చేశారు. మ్యూజియం ఆరుబయట మేడారం సమ్మక్క సారలమ్మ జననం తొట్టలో వేసే విగ్రహాలు మేడారం సమ్మక్క సమ్మక్క పెళ్లి గిరిజన వాయిద్య కాలనీ విగ్రహం తోపాటు అనేక జీవనశైలికి సంబంధించిన బొమ్మలు ఇక్కడ కనువిందు చేస్తాయి. జాతరకు వచ్చే ప్రతి భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జీవన శైలిని ఈ మ్యూజియంలో తెలుసుకుంటున్నారు.