Telangana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు కగార్ లాంటి ఆపరేషన్లను మొదలు పెడితే. మావోయిస్టు పార్టీ కోవర్టుల ఏరివేతకు వ్యూహరచన చేస్తోంది. కొద్దిరోజులుగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లు కోవర్ట్ సమాచారంతో జరిగినవని భావిస్తున్న మావోయిస్టు పార్టీ కోవర్ట్‌లను గుర్తించి శిక్షలు వేస్తుంది. 


వరుస ఎన్‌కౌంటర్లతో కోలుకోలేని దెబ్బ
వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి ఆపరేషన్ పహార్, కాగార్ చేపట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 140 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీకి అత్యంత పట్టున్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని కాంకేర్, అబుజ్మడ్, గచ్చిరోలి ప్రాంతాలతోపాటు తెలంగాణ సరిహద్దుల్లో ఎనమిది నెలల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ బలగాలు అడుగుపెట్టాలంటే పక్క వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. లేదంటే భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వరుస ఎన్‌కౌంటర్‌లు జరగడంతో మావోయిస్టు పార్టీ ఆలోచనలో పడింది.


ఎన్‌కౌంటర్లు, పార్టీ నాయకత్వంపై ఆరా...
పార్టీకి జరుగుతున్న నష్టంపై కేంద్ర కమిటీ వరుస ఎన్‌కౌంటర్లు, పార్టీలో పని చేస్తున్న నేతలపై దృష్టి పెట్టింది. కేంద్ర కమిటీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో పార్టీలోని నేతలు కోవర్టులుగా మారి పార్టీ  సమాచారాన్ని చెరవేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి కొరియర్ వ్యవస్థ కీలకం. కొరియర్ వ్యవస్థతో మైదాన ప్రాంతాల్లో జరుగుతున్న సమాచారంతోపాటు మావోయిస్టుల సమాచారం పార్టీ ఆదేశాలతో ఇతరులకు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. 


అలాంటి కొరియర్ వ్యవవస్థ పై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. కోవర్ట్‌లను గుర్తించి పార్టీ నుంచి బయటకు పంపడం లేదంటే శిక్షించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకే పార్టీలో కమాండర్‌గా పని చేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నిల్సో కోవర్ట్‌గా మారిందనే నెపంతో ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలోని చెన్నపురం గ్రామ సమీపంలో హత్య చేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ కష్టకాలంలో ఇలాంటి నిర్ణయంపై చర్చ జరుగుతుంది.


Also Read: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?


తెలంగాణ లో నిల్సొ మూడో వ్యక్తి
కోవర్ట్ పేరుతో చంపిన వ్యక్తుల్లో నిల్సో మూడో వ్యక్తి. 1992లో మొదటిసారిగా సరళ అనే మిలిటెంట్‌ను నిజామాబాద్ జిల్లాలో మావోయిస్టులు కోవర్ట్ పేరుతో హత్య చేశారు. 2005లో దళ సభ్యురాలైన పద్మను కోవర్ట్ నెపంతో హత మార్చారు. ఈ నెల 21న చర్ల సమీపంలో కమాండర్ రాధ అలియాస్ నిల్సోను కోవర్ట్  ముద్ర వేసి హత్య చేశారు. హత్య చేసిన ప్రదేశంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ వదిలి వెళ్ళారు. కోవర్ట్ నెపంతో హత్యకు గురైన ఈ ముగ్గురు చదువుకుంటూ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్ళారు. 



మావోయిస్టుల నిర్ణయంతో సర్వత్ర చర్చ.
కోవర్ట్ నేపంతో మావోయిస్టు నేతలను హత్య చేయడంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవర్ట్ నెపంతో మావోయిస్టు నేతలను హత్య చేయడంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేక పోలేదు. పార్టీ సానుభూతిపరులతోపాటు వారి కుటుంబాలలో మావోయిస్టు పార్టీపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. మావోయిస్టులు పార్టీకి నష్టం చేసే వారిని ఒక్కటి రెండు సార్లు విచారించిన తరువాతే నిర్ణయం తీసుకున్నా చంపడం కరెక్ట్ కాదంటున్నారు మాజీ మావోయిస్టులు. 


Also Read: ప్రపంచంలోనే ధనిక గ్రామం, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే విశేషాలు - మన దేశంలోనే ఉందా ఊ