Satyavathi Rathod About International Womens Day 2023:
- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం
- మహిళా స్ఫూర్తి నింపే వారికి అవార్డుల ప్రదానం
- కాకతీయుల గడ్డపై రాణి రుద్రమలకు సన్మానం చేయడం సంతోషకరం
మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని రాష్ట్ర కార్యాలయంలో కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో మహిళా అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గిరిజన, స్త్రీ, శిశు సంరక్షణ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సంవత్సరం వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గల ఆడిటోరియంలో జరుపుకోవడం సంతోషకరంగా ఉందని, అందరూ బాధ్యతగా, ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
కాకతీయుల గడ్డ కళాకారులకు నిలయం
హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత గల పట్టణంగా వరంగల్ కి పేరు ఉందని, కాకతీయుల గడ్డ కళాకారులకు నిలయం కాబట్టి రాణి రుద్రమలకు ఘనంగా సన్మానించాలని అన్నారు. అనేక రంగాలలో ప్రముఖులను గుర్తించేందుకు ఒక కమిటీని నియమించాలని, ప్రతిభగల వారిని గుర్తించి, వెలికి తీసి, మహిళల్లో స్ఫూర్తి నింపే వారిని ఎంపిక చేసి, అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక లక్ష రూపాయల పారితోషకం, సన్మాన పత్రం షీల్డ్ శాలువాతో సన్మానించడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు అవార్డు తీసుకొని ఉన్నారని, ఇప్పుడు కూడా జిల్లాకు సంబంధించిన ముఖ్యులను సన్మానించాల్సిన బాధ్యత మనకు ఉందన్నారు.
ప్రోటోకాల్ పాటించాలని, ఎవరూ కూడా మిస్ కాకుండా సర్పంచి నుండి మొదలుకొని మంత్రి వరకు అందరిని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కమిషన్ మెంబర్లు ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. వీరితోపాటు మహిళా జర్నలిస్టులు డాక్టర్లు వివిధ శాఖల్లో పని చేసిన అధికారులకు గుర్తింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రం నల్గొండ నుండి వస్తారు కాబట్టి వచ్చినటువంటి అతిధులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
బొకేస్ కాకుండా మొక్కలు ఇవ్వండి
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబిం మించే విధంగా కాకతీయ తోరణం గల షిల్డ్ లు, పోచంపల్లి శాలువాలను వినియోగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. బొకేస్ కాకుండా మొక్కలను ఇవ్వాలని అన్నారు. సమావేశంలో స్పెషల్ సెక్రటరీ భారతి హోలీ కేర్ పాల్గొని డయాస్ అరేంజ్మెంట్స్, రూట్ మ్యాపులు, భారీ కేడ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, మొబిలైజేషన్, వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా విభిన్న శాఖలలో పనిచేసేటువంటి మహిళ ఉద్యోగులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలీ కేరి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, జేడీ లక్ష్మీ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.