Telangana Latest News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు కారు దిగి ఇతర పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో బీ అర్ ఎస్ ఇంకా చతికల పడడంతో ఆ పార్టీ నేతలంతా భవిష్యత్తు రాజకీయాల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆ కోవలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఏ పార్టీకి దయాకర్ రావు అవసరం ఉంది. ఏ పార్టీకి అవసరం లేదు అనే విషయాలను తెలుసుకుందాం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా మాస్ లీడర్ గా కొనసాగుతున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దయాకర్ రావు 2014 వరకు టిడిపిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుండి పాలకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దయాకర్ రావు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోవడం, బీ అర్ ఎస్ అధికారానికి దూరం కావడం జరిగింది. ఒక్కొక్కరిగా నేతలు పార్టీ వీడుతుందడంతో అదే దారి దయాకర్ రావు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దయాకర్ రావు మారుతున్నట్లు ప్రచారం జరిగిన ప్రతిసారి తాను బీఅర్ఎస్ ను వీడను అని ఖండిస్తున్నారు.
కాంగ్రెస్ లేదా బీజేపీ?
అయితే దయాకర్ రావు ఓ సారి బీజేపీలోకి... మరో సారి కాంగ్రెస్ లోకి పోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దయాకర్ రావు బిజేపి లోకి వెళ్తే కేంద్రం లో అధికారంలో ఉంది కాబట్టి దయాకర్ రావుకు రాజకీయంగా నిలదొక్కుకొవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కేసులతో కక్షసాదింపు చర్యలకు పాల్పడిన తనను తాను కాపాడుకోవచ్చు. ఇక కాషాయం పార్టీకి కూడా లాభం జరుగుతుంది. ఎందుకంటే దయాకర్ రావు గతంలో ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో బిజేపి ఉనికే లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో దయాకర్ రావు బలమైన నేత కాబట్టి. బిజేపి పార్టీకి లాభం జరుగుతుంది. ఈ కోణంలో దయాకర్ రావు బీజేపీ లోకి వస్తాను అని డిసైడ్ అయితే ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఎర్రబెల్లి పార్లమెంట్ ఎన్నికలకు ముందే బిజేపి లోకి వెళ్ళే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దయాకర్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో కొద్దీ రోజులు అపినట్లు సమాచారం. మళ్లీ బిజేపి పెద్దలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
15 రోజులుగా ప్రచారం
అయితే దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తున్నట్లు పది పదిహేను రోజులుగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దయాకర్ రావు కు బద్దశత్రువు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి ఒప్పుకొనే పరిస్థితి లేదు. ఒకవేళ కక్ష సాధింపు అంశాలను పక్కనపెట్టి దయాకర్ రావు ను పార్టీ లోకి తీసుకొంటే కాంగ్రెస్ పార్టీ లాభమా అంటే ఏమీలేదు. జిల్లాలో పార్టీ బలంగా ఉంది. లేదా దయాకర్ రావు నియోజకవర్గంలో పార్టీ వీక్ గా ఉంది అంటే అదీలేదు. ఎర్రబెల్లి ఎమ్మెల్యే అయినా పార్టీ లోకి తీసుకుంటే ఒక ఎమ్మెల్యే బలం పెరుగుతుంది అనుకున్న అదిలేదు. కాబట్టి దయాకర్ రావు ను కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపెట్టారు.
దయాకర్ రావు పార్టీ మారాలనే నిర్ణయం జరిగింది. ఏపార్టీ లోకి వెళ్తే లాభం అనే కోణం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో పర్వతగిరి లో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని అనుచరులను అడినట్లు తెలుస్తుంది. వారు బిన్న అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎర్రబెల్లి దయాకర్ రావు అతిత్వరలో పార్టీ మారడం ఖాయమని తెలుస్తుంది.