bathukamma celebrations in warangal | వరంగల్: ఆడపడుచుల పండుగ... పూల పండుగ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు నేటి నుండి 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. అమావాస్య రోజున కొలుకునే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు జరుపుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎంతో భక్తితో  ఆనందంతో ప్రజలు జరుపుకుంటారు.


తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు, వేడుకలు జరిగిన వరంగల్ లో జరిగే బతుకమ్మ వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంప్రదాయం ప్రకారం తొలి రోజున శివాలయాల్లోనే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. వరంగల్‌లోని ప్రపంచ ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయారు. వేయిస్తంభాల దేవాలయం మహిళలు, యువతులతో పులకరించి పోయింది.


Also Read: Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే! 


ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూలను పూజించే బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కోలాహలంగా జరిగాయి. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తోటి ఆడపడుచుల తో కలిసి బతుకమ్మ ఆడారు.