Hyderabad Traffic Diversion: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం 4.40 గంటలకు వెంకయ్య చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు ఆయన వెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 ఉపరాష్ట్రపతి వెంకయ్య వెళ్తారు. జనరల్ చెకప్ లో భాగంగా కేవలం వైద్య పరీక్షల నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల నెల్లూరులో ఉపరాష్ట్రపతి..
నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పర్యటించారు. వెంకటాచలంలోని అక్షర విద్యాలయాన్ని వెంకయ్యనాయుడు, అమిత్ షా సందర్శించారు. అక్షర విద్యాలయంలో ట్రైనింగ్ సెంటర్ సోమా సెంటర్, ముప్పవరం ఫౌండేషన్, ఎల్వీఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఉప రాష్ట్రపతితో కలిసి హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో సేవాలయానికి వెళ్తే కూడా అంతే పుణ్యం వస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.
Also Read: గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం: వెంకయ్య నాయుడు
హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
అదే సమయంలో సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలలో భాగంగా నేడు ర్యాలీ జరగనుంది. బుధవారం అశోక్ బజార్ గురుద్వార నుంచి ర్యాలీ మొదలై మళ్లీ అక్కడే ముగిస్తారు. సిక్కుల ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. చార్మినార్, గోషామహల్, సుల్తాన్ బజార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
గురునానక్ జయంతి ర్యాలీ నేపథ్యంలో పాతబస్తీతో పాటు మరికొన్ని ఏరియాలలో సైతం ట్రాఫిక్ నిబంధలలో మార్పు చేశారు. ఆఫ్జల్ గంజ్ జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయా పూల్ ప్రాంతాల్లోనూ వాహనాల డైవర్షన్ చేస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. వాహనదారులు ఈ విషయాలు గమనించి రూట్లు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు సూచించారు.
Also Read: Nizamabad: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
Also Read: తెలంగాణ బాలిక అరుదైన ఘనత.. సినిమాలు చూసింది.. కిలిమాంజారో ఎక్కేసింది