ధాన్యం కొనుగోలు విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ( FCI ) అన్ని రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని ఒక్క తెలంగాణ ( Telangana ) మాత్రమే చేసుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ( Piyush Goyal ) మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం  ప్రకటించిన కేసీఆర్ ( KCR ) తీరుపై గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ( Telangana ) విషయంలో కేంద్రం వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే బియ్యం ( Rice Procurement ) సేకరణ జరుగుతుందన్నారు. గతంలో కంటే ఏడున్నర రెట్లు ఎక్కువగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 


దేశంలోనే అత్యంత పొడవైన టన్నెల్ రోడ్డు హైదరాబాద్ లో- ఎక్కడి నుంచి ఎక్కడికంటే?


కేసీఆర్ రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని గోయల్ ( Goyal ) మండిపడ్డారు. రైతుల్లో భ్రమలు కల్పించి వారిని వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. రా రైస్ ( Raw Rice ) ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందని.. ఎంత ముడి ధాన్యం ఇస్తారో తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదన్నారు. కేసీఆర్ తన చేతకాని తనాన్ని కేంద్రంపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని గోయల్ విమర్శించారు. తెలంగాణ నేతలు ( Telangana Leaders ) కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని గోయల్ అసహనం వ్యక్తం చేశారు.పంజాబ్ నుంచి కూడా నేరుగా బియ్యాన్నే సేకరిస్తామని .. ధాన్యం సేకరించమని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. పంజాబ్ అయినా తెలంగాణ అయినా ప్రజలకు ఒక్కటేనన్నారు. 


జీడీపీ పెంచమంటే పెట్రో, గ్యాస్ రేట్లు పెంచుతారా? బీజేపీని దేశం నుంచి తరమాలి: తలసాని, కవిత ఫైర్
 
ధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ ( Delhi ) వచ్చిన మంత్రులతో సమావేశం అవడానికి ముందే పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు  చేయడం కలకలం రేపింది. ప్రధాని మోదీకి ( PM MOdi ) సీఎం కేసీఆర్ బుధవారం రాత్రే లేఖ ( KCR Letter ) రాశారు. ఆ లేఖలోని అంశాలన్నింటికీ గోయల్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తప్పంతా తెలంగాణ ప్రభుత్వం వైపే ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని వాదిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గోయల్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.