కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, భూ సంస్కరణలు ప్రధానాంశాలుగా పాదయాత్రలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. శనివారం చేవెళ్ల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. 10 కిలోమీటర్లు కొనసాగిన రేవంత్ పాదయాత్ర చేవెళ్లకు చేరుకుంది. యాత్రలో రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన... దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంపీటీసీ కావలి సుజాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు. టీఆర్ఎస్ చెరువుకు గండి పడిందని, టీఆర్ఎస్ పరిస్థికి ఇక చేవెళ్ల బస్టాండే అని ఎద్దేవా చేశారు. 






Also Read: 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు.. రైతు బంధు పథకం అమలుకు కేసీఆర్ ఆదేశం !


పన్నులు దోచుకుంటున్నారు


దేశంలో 8 ఏళ్లుగా దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు పాలన సాగిస్తున్నారని, 2014 లో 60 రూపాయల లీటర్ పెట్రోల్ ఇప్పుడు 108 లీటర్ అయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవని, ఇప్పుడు సంచిలో డబ్బు తీస్కుకొని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారని, అంటే ఇప్పటికీ 14 కోట్ల ఉద్యోగాలు రావాలన్నారు. కానీ మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. పెట్రోల్ లీటరుకు 60 రూపాయలు, గ్యాస్ రూ.400 ఉండేవని, ఇప్పుడు ధరలు పెంచి కేసీఆర్, మోదీలు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 30 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్నాయన్నారు.


Also Read: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన


రైతుల వడ్లు కొనే వరకూ పోరాటం


'పండించిన పంటలకు ధరలు లేవు. అమ్మబోతే అడవి, కొనపోతే కొరివి అయ్యింది. వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్లు అభివృద్ది కోసం పార్టీ మారాం అంటున్నారు. 
వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలి. దిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడు. అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్ లో పండుకున్నారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

 


Also Read:  ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి