గతంలో జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీరు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను కూడా చేపట్టామన్నారు. జలయజ్ఞంలో భాగంగానే చాలా ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడిపై అందించామని గుర్తుచేశారు.  పౌల్ట్రీ ఫామ్ లను కూడా బలోపేతం చేశామన్నారు. ఈ అన్ని అంశాలపై చర్చకు మంంత్రి కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డేట్, టైం చెబితే చర్చకు సిద్ధమన్నారు. 


Also Read:  ప్రగతి భవన్‌కు బీహార్ ప్రతిపక్ష నేత.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక చర్చలు ...


ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు 


టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాపులు ఓపెన్ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. లిక్కర్ అమ్మకాలతో 7 ఏళ్లల్లో లక్షా 50 వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారన్నారు. తాగుబోతులకి కేసీఆర్ అంబాసిడర్ గా మారిరని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తులసి వనం లాంటి తెలంగాణను గంజాయి వనంలా మార్చారని ఆరోపించారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో అసలు ఏం పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గంజాయి సాగు చేస్తున్నారనే అనుమానం వస్తుందన్నారు. గజ్వేల్ ఫామ్ హౌస్ ను పర్యాటక ప్రాంతంగా మార్చి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు బీమా ఇస్తున్నామని పత్రికల్లో పెద్దపెద్ద యాడ్స్ వేసుకున్న టీఆర్ఎస్ సర్కార్... 2014 ఆగస్ట్ నుంచి 2018 వరకు మూడున్నర ఏళ్లల్లో 75 వేల 14 మంది రైతులను బలిగొందని ఆరోపిచారు. 


Also Read:  చిన జీయర్ స్వామి వద్దకు సీఎం కేసీఆర్.. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణపై చర్చ, రామానుజుల విగ్రహ పరిశీలన


రైతు హంతకులు కేటీఆర్, కేసీఆర్ 


'దేశంలో ఇలాంటి రాష్ట్రం ఎక్కడ లేదు. మూడున్నరేండ్లల్లో ఇంత మంది చనిపోయారంటే. 7 ఏళ్లల్లో ఇంకేంత మంది చనిపోయి ఉంటారో లెక్కలు బయటపెట్టాలి. 18 నుంచి 58 ఏళ్ల వయసు ఉన్న రైతులు చనిపోతున్నారు. ఈ రైతుల చావులకు కేసీఆర్ సర్కార్ కారణం కాదా?. రైతు బంధు సంబురాలు అంటున్నారు. వీరిని మూతి మీద కొట్టాలి. రైతు హంతకులుగా కేటీఆర్, కేసీఆర్ మారారు. రైతుల చావులపై చర్చ చేయడానికి సిద్ధం. అమరవీరుల స్థూపం వద్దా కుర్చుందామా లేదంటే రైతుల మధ్యలోనే మాట్లాడుకుందామా. సవాల్ విసిరితే కేటీఆర్ అయ్యా చాటున లేదంటే కోర్టు చాటున దాకుంటాడు. ' అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి