Top 5 Telugu Headlines Today 8 November 2023:
జగన్ అక్రమాస్తు కేసుల్లో కీలక మలుపు - తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ !
అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ నువిచారణకు స్వీకరించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద స్వీకరించేందుకు గతంలో రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ ధర్మానసం ముందు ప్రస్తావించారు. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్, పోలింగ్ ముందు రిలీజ్ చేసేలా ప్లాన్
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం. ఆ తర్వాత ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు ద్వారా ప్రజలను ఆకట్టుకునేవారు. అభ్యర్థులు వీధి వీధి తిరిగి ప్రజలను కలిసి తాము చేసిన అభివృద్ధిని వివరించేవారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ మారింది. వాయు వేగంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేసేలా సోషల్ మీడియాను ప్రచార సాధనంగా మలుచుకుంటున్నారు. డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గురువారం నుంచి ఏపీలో " వై ఏపీ నీడ్స్ జగన్ " - అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామన్న సజ్జల
గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ప్రకటించారు. సీఎం జగన్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయన్నారు. సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తామని ప్రకటించారు. చంద్రబాబు ( Chandrababu ) పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నామని సజ్జల పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ వాదనలు- కేసు 29కి వాయిదా
కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఏపీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 29కి వాయిదా వేసింది. కృష్ణా జిల్లాల పంపిణీలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ వేసిన పిటిషన్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలంగాణ తరుఫున వాదించిన సి.ఎస్.వైద్యనాథన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై స్పందించిన కేంద్రం... కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలు ప్రతిపాదించింది. దీని వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కలాం, బాలయోగికి పదువులు ఇచ్చిందెవరు? ఎన్డీఏ ఘనతను బీజేపీ ఖాతాలో మోడీ వేస్తున్నారా?
బీఆర్ఎస్(BRS) కాంగ్రెస్(Congress) సీ టీం అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీం అంటూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏలు రెండు ఒక్కటే నని, రెండు కుటుంబపార్టీలేనని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ స్పీచ్ ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత సీన్ మార్చేశారు. బీసీలు, తెలుగుదేశం పార్టీ సెంట్రిక్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలను అక్కున చేర్చుకుంది. ఆ పార్టీకి ఉన్న బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే బీజేపీ బీసీ మంత్రాన్ని జపిస్తోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న-హస్తం పార్టీలో జాయినింగ్ జోష్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) వేళ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ జోష్ పెరుగుతోంది. నేతల చేరికలతో దూకుడు పెంచుతోంది హస్తం పార్టీ. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. కలిసి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. బీఆర్‌ఎస్(BRS) పార్టీని ఓడించి... అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు పార్టీల నేతల కాంగ్రెస్(Congress) కండువా కప్పుకోగా... తాజాగా తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ హస్తం పార్టీలో చేరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి