Top 5 Telugu Headlines Today 20 August 2023:
గుడివాడ నుంచైనా పోటీకి రెడీ - చంద్రబాబును కలిసిన గన్నవరం వైసీపీ మాజీ నేత
గన్నవరానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత యార్లగడ్డ వెంకట్ రావు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. నేడు (ఆగస్టు 20) ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. టీడీపీలో చేరడానికి తాను ఇష్టంగానే ఉన్నానని, త్వరలోనే చేరతానని చంద్రబాబుకు చెప్పినట్లుగా యార్లగడ్డ వెంకట్రావు వివరించారు. భేటీ తర్వాత ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూడా కలిసి పని చేద్దామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారని అన్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజా ప్రతినిధిగా ఉండాలని భావించి గతంలో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేశారు. పూర్తి వివరాలు
ఉప్పల్‌లో టికెట్ పంచాయితీ! ఎమ్మెల్సీ కవిత వద్దకు ఇద్దరు నేతలు, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని రిక్వెస్ట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు ఖరారు చేసి జాబితా విడుదల చేయనున్న వేళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. టికెట్ ఫలానా వారికి ఇవ్వబోతున్నారనే వదంతుల నేపథ్యంలో గతంలో బేదాభిప్రాయాలు ఉన్నవారు కలిసిపోతున్నారు. తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిణామమే జరిగింది. ఉప్పల్‌లో బి.లక్ష్మా రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఎమ్మెల్సీ కవితను కలిశారు. పూర్తి వివరాలు
ఆమరణ దీక్షతో క్షీణిస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం - దీక్షకు మహారాష్ట్ర ఎమ్మెల్యే సంఘీభావం
నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దీక్ష విరమించేదిలేదని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముత్కేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే తుషార్ గోవింద్ రావు రాథోడ్.. మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో గోవింద్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండించారు. పూర్తి వివరాలు
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కోసమే బీజేపీ వెయిటింగ్ - కేసీఆర్ తొందరపడతారా ?
భారత రాష్ట్ర సమితి తొలి జాబితా విడుదలపై గత వారం, పది రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నారు కానీ.. అసలు జాబితా రిలీజ్ కావడం లేదు. కానీ ఇదే జాబితా అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో తప్పనిసరిగా టిక్కెట్లు వారికే అనే నేతల పేర్లతో పాటు కాస్త డైలమాలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ అసలు కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయన ఫైనల్ చేసుకున్న లిస్టులో ఎవరి పేర్లున్నాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ ట్విస్టేమిటంటే బీఆర్ఎస్ తొలి జాబితా కోసం.. బీఆర్ఎస్ ఆశావహులే కాదు.. బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. పూర్తి వివరాలు