మామూలుగా మల్టీ స్టారర్ సినిమాలంటేనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అది కూడా మెగా ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆ హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ‘బ్రో’ విషయంలో కూడా అదే అయ్యింది. ‘వినోదాయ సితం’ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా కూడా సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మెగా హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి మూవీ మీద ముందు నుండే అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్‌కు, రీమేక్‌కు చాలా తేడా ఉంటుంది అని మేకర్స్ ముందు నుండే చెప్తున్నా.. రీమేక్స్ వల్ల విసిగిపోయిన కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం ‘బ్రో’పై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.


కాంట్రవర్సీల వల్ల హైప్..
‘బ్రో’ మూవీ విడుదలయిన మొదటి వీకెండ్ వరకు కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయని, పవన్ కళ్యాణ్ ముందు సినిమాలకంటే దీనికే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ కలెక్షన్స్ చుట్టూ కూడా కాంట్రవర్సీ జరగడంతో అవి నిజమా కాదా అని కొందరు ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. పైగా ‘బ్రో’ చుట్టూ తిరిగిన రాజకీయ కాంట్రవర్సీల వల్ల కూడా మూవీకి కొంచెం హైప్‌తో పాటు కొన్ని కలెక్షన్స్ కూడా వచ్చాయి. మూవీ విడుదలయినప్పుడు హిట్ అని, కలెక్షన్స్ బాగా వచ్చాయని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ‘బ్రో’ డిజాస్టర్ అని విమర్శలు వస్తున్నా.. స్పందించడం లేదు అంటే నిజంగానే సినిమా డిజాస్టర్ అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.






నెలరోజులు పూర్తవ్వక ముందే..
జులై 28న ‘బ్రో’ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. అయితే నెల పూర్తవ్వకుండానే.. అంటే ఆగస్ట్ 25న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నట్టు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఆడియోలలో కూడా ‘బ్రో’ స్ట్రీమ్ అవుతున్నట్టు తెలిపింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు అందించారు. సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ‘బ్రో’ను నిర్మించారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఇంప్రెస్ చేసినా పాటల విషయంలో మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ‘బ్రో’లో ఒక్క పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొత్తానికి థియేటర్లలో పవర్ స్టార్‌ను చూడడం మిస్ అయినవారికి ఆగస్ట్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది ‘బ్రో’.


Also read: రష్మిక స్థానంలో శ్రీలీల - ఆ యంగ్ హీరోతో రెండోసారి రొమాన్స్‌కు రెడీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial