టాలీవుడ్‌లోకి ఒక హీరోయిన్ కొత్తగా ఎంటర్ అయ్యిందంటే చాలు.. తన మొదటి సినిమా థియేటర్లలో విడుదల అవ్వకముందే మరో రెండు, మూడు ఛాన్సులు తనకోసం ఎదురుచూస్తుంటాయి. ఒకవేళ తన డెబ్యూ మూవీ హిట్ అయ్యిందంటే అంతే.. తనకోసం నిర్మాతలు క్యూ కడతారు. శ్రీలీల విషయంలో కూడా అదే జరిగింది. అమ్మాయి క్యూట్‌గా ఉంది, డ్యాన్స్ ఇరగదీస్తుంది అన్న ఉద్దేశ్యంతో తనకు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు ఇచ్చారు నిర్మాతలు. అందుకే హీరోయిన్‌గా ఎంటర్ అయ్యి కొంతకాలమే అయినా ప్రస్తుతం తన చేతిలో దాదాపు డజను సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా శ్రీలీల తన వద్దకు వస్తున్న ఆఫర్లను కాదనుకుండా యాక్సెప్ట్ చేస్తోంది. తాజాగా మరో సినిమాను ఓకే చేసిందట ఈ ముద్దుగుమ్మ.


రష్మిక తప్పుకుంది..
ఒక సినిమాను ప్రారంభించినప్పుడు ముందుగా ఒక హీరోయిన్‌ను అందులో లీడ్ రోల్‌కు ఎంపిక చేస్తారు. కానీ అదే హీరోయిన్‌తో సినిమా పూర్తవుతుందా లేదా అనే విషయానికి మాత్రం గ్యారెంటీ లేదు. ఒక్కొక్కసారి డేట్స్ కారణంగా, మరికొన్ని మేకర్స్‌తో మనస్ఫర్థల కారణంగా సినిమాల నుంచి హీరోయిన్స్ తప్పుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా రష్మిక మందనా విషయంలో కూడా అదే జరిగింది. కన్నడలో ఒకట్రెండు సినిమాలు చేసి హిట్ కొట్టిన రష్మికను తెలుగులో హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల. అందుకే వెంకీ దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా రష్మిక కాదనకుండా మూవీని ఒప్పుకుంటుంది. తాజాగా కూడా ఒప్పుకుంది. కానీ చివరి నిమిషంలో అంతా రివర్స్ అయిపోయింది.


‘భీష్మ’ కాంబినేషన్ కట్..
‘భీష్మ’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని, రష్మిక, నితిన్, వెంకీ కుడుముల మళ్లీ చేతులు కలుపుతారని మూవీ టీమ్ అనౌన్స్ చేసి చాలాకాలమే అవుతోంది. పైగా ఈ అనౌన్స్‌మెంట్ చాలా క్రియేటివ్‌గా జరిగింది. దీనికోసం మేకర్స్.. ప్రత్యేకంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతుండడంతో రష్మిక డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. ఈ వార్త ‘భీష్మ’ కాంబినేషన్ రిపీట్ అవుతుంది, మళ్లీ ఆ రేంజ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌ను చూసే అవకాశం ఉంది అనుకున్న ప్రేక్షకులకు నిరాశను ఇచ్చింది. కానీ శ్రీలీల ఆ స్థానంలోకి వస్తుందని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


ఇది రెండోసారి..
ఇప్పటికే రష్మిక మందనాతో పలు సీన్స్ చిత్రీకరించాడట దర్శకుడు. కానీ వాటన్నింటిని తీసేసి శ్రీలీలతో మళ్లీ అవే సీన్స్ కొత్తగా తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నితిన్, శ్రీలీల కలిసి ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇంకా ఈ మూవీ పూర్తవ్వక ముందే నితిన్‌తో మరోసారి జోడీకట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే 2024 మొత్తం ఎక్కడ చూసినా శ్రీలీలనే కనిపిస్తుందేమో. ఏ పోస్టర్ చూసినా హీరోయిన్‌గా శ్రీలీలనే ఉంటుందేమో అంటూ పలువురు ప్రేక్షకులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల చిత్రాలతో కూడా శ్రీలీల బిజీగా ఉంది. 


Also Read: 40, 50 ఏళ్లు వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు - ఐశ్వర్య రాయ్‌పై కంగనా కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial