Top 5 Telugu Headlines Today 11 November 2023: 


'మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట' - సాధికారత చేతల్లో చూపించామన్న సీఎం జగన్
రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం జగన్ తెలిపారు. విజయవాడలో పర్యటిస్తున్న ఆయన, మైనారిటీస్ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి (Abul Kalamazad Jayanthi) ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనారిటీలను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను తమ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. పేద ముస్లింలందరికీ దివంగత నేత వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి రాక
మునుగోడు(Munugodu) నుంచి టికెట్ దక్కకపోవడంతో తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ (Congress)నేత పాల్వాయి స్రవంతి(  Palvai Sravanthi Reddy) కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.  నేడు కేటీఆర్ (KTR)సమక్షంలో బీఆర్‌ఎస్‌(BRS) చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేశారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడంతో ఈ ఎన్నికల్లో స్రవంతికి టికెట్ కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని ఆలోచనలో ఉన్నారని.. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బాణసంచా కాల్చడంపై ఆంక్షలు - బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు
ఎన్నికల సమయంలో  అన్నీ వివాదాస్పద అంశాలే. రాజకీయ పార్టీలు ( Political Parties )  అనుకోవాలే కానీ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టరు. తెలంగాణలనూ అంతే. దీపావళి పండుగకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఆ ఉత్తర్వులు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ మండిపడే.. బీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీసులు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్తమయం - తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) (Chandramohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ (KCR), జగన్ (Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులుగా ఎదిగారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


2 గంటలపాటు మోదీ టూర్‌- ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు
ప్రధాన మంత్రి మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా ఈ రూట్‌లలో వెళ్లకుండా ప్రత్యమ్నాయ రూట్‌లోను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. పీఎం మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇవాళ వస్తున్నారు. ఈ వారం వ్యవధిలో ప్రధానమంత్రి రావడం ఇది రెండోసారి. సాయంత్రం ప్రధానమంత్రి పర్యటన వేళ హైదరాబాద్‌ పోలీసులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి