TS News Developments Today: ఇవాళ్టి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ ఐదో విడత మహాసంగ్రామ యాత్ర చేయలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ రోజు ఉదయం భైంసా నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న రాత్రి కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద అడ్డుకొని తిరిగి వెళ్లాలని కోరడంతో కరీంనగర్ వచ్చిన బండి సంజయ్ ను పోలీసులు పంపించేశారు. 


బైంసా నుంచి పాదయాత్ర జరిపి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసిన నేపథ్యంలో కరీంనగర్ లో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు అనుమతి తీసుకునైనా పాదయాత్రకు బయలుదేరుతామని స్పష్టం చేసిన బండి సంజయ్ దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ న్యాయ విభాగంతో చర్చించారు. ఇక అనుమతి నిరాకరించడం పట్ల ఆగ్రహం గా ఉన్న బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగుతాయని సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. 


ప్రస్తుతం కరీంనగర్‌లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. వేచి చూసే ధోరణి లో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నేడు పాదయాత్ర సభ నిర్వహణ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలు. ఒక వేళ అనుమతి వస్తే మధ్యాహ్నం భైంసా వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా భైంసా వెళ్తా అని బండి సంజయ్ అంటున్నారు. ఇక ఈ రోజు కరీంనగర్ లోని మహాలక్ష్మి ఆలయాన్ని బండి సంజయ్  దర్శించుకోనున్నారు. మరోవైపు బండి సంజయ్ ను కలవడానికి పలువురు నేతలు, కార్యకర్తలు కరీంనగర్ చేరుకున్నారు. అయితే కోర్టు అనుమతిని బట్టి బీజేపీ నిర్ణయం ఉండే అవకాశం. ఇక ముందు జాగ్రత్తగా బండి సంజయ్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


నేడు నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్. 


దామరచర్ల లో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు అక్కడికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి సిఎం కెసిఆర్ దామరచర్ల పర్యటనకోసం బయలు దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్ల చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి,  ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సిఎం కెసిఆర్  పరిశీలిస్తారు. థర్మల్ పవర్ స్టేషన్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి గురించి ఉన్నతాధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం హైద్రాబాద్ కు సిఎం కెసిఆర్ తిరుగు ప్రయాణమౌతారు.


నేడు సిట్ ముందుకు విచారణకు హాజరుకానున్న నందకుమార్ సతీమణి.


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ సంబంధించిన విషయాలపై సిట్ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా నందకుమార్ సతీమణి చిత్రలేఖ ఈరోజు సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమెను ఒకసారి సిట్ బృందం సుదీర్ఘంగా విచారించింది. ఆమె సెల్ ఫోన్ నుంచి కొన్ని విషయాలపై క్లారిటీ తీసుకునేందుకు మరోసారి ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విషయాలను చిత్రలేఖకు ఆమె భర్త ఏమైనా చెప్పి ఉంటారా ఆధారాలు ఏమైనా లభిస్తాయి అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ రోజు ఓ ఎన్జీవో ప్రతినిధి విజయ్ కూడా సోమవారం విచారించనుంది.  విజయ్ ను  శనివారం కూడా పోలీసులు విచారించారు.


ఇన్ కంటాక్స్ అధికారులు ఎదుట మంత్రి మల్లారెడ్డి హాజరు.


మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇన్ కం టాక్స్  అధికారులు జరిపిన సోదాల్లో అనేకమైన కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే వీటికి సంబంధించి విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలని మల్లారెడ్డి తోపాటు ఆయన బంధువులు, ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. విచారణలో ఈరోజు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కొంతమంది ఉద్యోగులు కూడా హాజరుకానున్నారు.


హైదరాబాద్ లో నిర్మితమౌతున్న అంబేద్కర్ విగ్రహా పనులను పర్యవేక్షించనున్న మంత్రలు 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా పనులను ఈరోజు మంత్రులు పర్యవేక్షించునున్నారు. సెక్రటేరియట్ సమీపంలో ఈ విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు విగ్రహపనులు పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నారు. సెక్రటేరియట్ ఓపెనింగ్ సమయానికి దీన్ని సిద్దం చేయాలని అధికారులు భావిస్తున్నారు.