TS News Developments Today: 


నేడు మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు


తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. సోమవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయన మృతదేహాన్ని సందర్శించారు ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనం కోసం మద్యాహ్నం వరకు పద్మాలయా స్టూడియోస్ లో పార్థివదేహం ఉంచుతారు మధ్యాహ్నం మహాప్రస్థానానికి పార్థివదేహం తరలించి ప్రభుత్వ అధికారులు అంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు మహేష్ బాబు కుటుంబసభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు పద్మలయాస్ స్టూడియోకు రానున్నారు. 


దిల్లీలో బీజేపీ పెద్దలను కలవనున్న ఈటెల, రాజగోపాల్ రెడ్డి


ఢిల్లీలోనే బిజెపి నేతలు ఈటెల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. నేడు అమిత్ షా తో భేటీ అవకాశాలున్నాయి. బీజేపీ జాతీయ నాయకులు కలిసి తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు వివరించునట్లుగా తెలుస్తోంది. వారు మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. అమీత్ షా గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల ఆయనతో భేటీ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారి దిల్లీ వెళ్ళిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  మునుగోడు ఉప ఎన్నికల ఓటమి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఎంపీ అరవింద్ ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షా తో పాటు పలువురు ముఖ్యనేతల్ని వారు ఈరోజు కలిసే అవకాశం ఉంది. 


తెలంగాణ పెండింగ్ సమస్యలపై నేడు కేంద్రంతో చర్చ


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పెండింగ్ అంశాలపై నేడు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ అధికారులు చర్చించనున్నారు.  తెలంగాణ అంశాలపై చర్చించేందుకు బుధవారం మీటింగ్ జరగనుంది. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల కార్యదర్శిలు హాజరు కారున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో అంశాలతో పరిష్కార నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయో వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే పెండింగ్లో ఉన్న అంశాలను ఈ-సమీక్ష పోర్టల్ లో అప్డేట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 10వ తేదీ కల్లా 17 శాఖలకు సీఎస్ సోమేశ్ కుమార్ ఈనెల ఐదున సర్కులర్ జారీ చేశారు. పెండింగ్ అంశాలతో పాటు లేటెస్ట్ స్టేటస్ ను కూడా వివరిస్తూ ఒక నోటును అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ముందుగానే తన అందజేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ డైరెక్టర్ దగ్గర చర్చించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అప్డేట్ విషయంలో కొంత వెనుకబడినట్లుగా తెలుస్తోంది. ఈరోజు జరిగే సమావేశంలో పెండింగ్ అంశాలపై చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలపై ఈనెల 23న సమావేశం జరగనుంది. 


నేడు మానుకొండురు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా 211వ రోజు మానకొండూరు నియోజక వర్గంలో కొనసాగనున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర. షర్మిల ఉదయం 10 గంటలకు అలుగు నూరు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత తిమ్మాపూర్ మండల పరిధిలోని LMD కాలని,మహాత్మ నగర్ కాలనీ,తిమ్మాపూర్, పుర్ణదల పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు  మాన కొండూరు మండల పరిధిలోని ముంజం పల్లి,మాన కొండూరు, ఈదుల గట్టు పల్లి మీదుగా పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మాన కొండూరు పట్టణం లో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ పై కరీంనగర్ లో జరిగినసభలో షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పై అమె పలు ఆరోపణలు చేశారు.