హైదరాబాద్‌కు ప్రియాంక, సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభకు హాజరు
హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ సాయంత్రం జరగనున్న సభలో యూత్ మేనిఫెస్టో ప్రకటించనుంది. గతేడాది వరంగల్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇవాళ జరగనున్న సభలో ప్రియాంకా గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటివి ప్రకటించనున్నారు.
కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయల‌్దేరి 4.45 గంటలకు సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5.45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 6.30 సమయంలో ఢిల్లీకి బయలు దేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇంకా చదవండి
టీడీపీ శ్రేణులతో కిక్కిరిసిన కర్నూలు కొండా రెడ్డి బురుజు ప్రాంతం
కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా తెలుగుదేశం నేతలు, శ్రేణులు తరలి వచ్చారు. వారి రాకతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. లోకేష్‌ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల గురించి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు వింటూ అందరితో ఫోటోలు దిగారు లోకేష్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
సెటిలర్స్ వల్ల అభివృద్ధికి ఆటంకం
పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District) సాలూరు(Saluru)లో నివసించే సెటిలర్లపై ఉప ముఖ్యంత్రి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు అంతా సెటిలర్ల వల్ల నష్ట పోతుందని రాజన్న దొర అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే ఉపయోగించు కుంటున్నారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి, కొట్టు పరువు పంచాయతీల్లో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లుడుతూ.. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న సెటిలర్ల వల్లే రోడ్లు నాశనం అవుతున్నాయని అన్నారు. భారీ వాహనాలను తిప్పుతుండటం వల్ల రోడ్లపై గుంతలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా పాడైన రోడ్లను బాగు చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని రాజన్న దొర విమర్శించారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కోరుతాని పేర్కొన్నారు. సాలూరు షెడ్యూల్డ్ ఏరియాగా మారితే సెటిలర్లు నష్ట పోతారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. ఇంకా చదవండి
టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దు, పవన్‌కు సలహాలు ఇవ్వొద్దు: నాగబాబు
రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి జగన్ పోవాలని.. అప్పుడు రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దని చెప్పారు. జనసే పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. అలాగే ప్రజల్లో చైతన్యం మొదలైందన్నారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు ఓటింగ్ శాతం 35కు పెరిగిందని అంచనాలు చెబుతున్నాయి. పార్టీకి మహిళలు ఆక్సిజన్ లాంటి వాళ్లని, పవన్ కల్యాణ్ కు సలహాలు ఇవ్వొద్దని అన్నారు. అలాగే ఆయన నిర్ణయాన్ని అంతా గౌరవిద్దామని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇంకా చదవండి
పెను తుపానుగా మారబోతున్న మోచా- తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంత?
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడం ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా మారుబోతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అనంతరం తుపానుగా మారి మయన్మార్ వైపు దూసుకెళ్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న తుపాను(Mocha Cyclone ) ఉత్తర దిశగా కదులుతోంది. మయన్మార్ వైపు దూసుకెళ్తున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతోంది.
ప్రస్తుతం అల్పపీడనంగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వేళ తెలుగు రాష్ట్రాలకు అకాల వర్షం ముప్పు ఇంకా పొంచి ఉంది. మరోవైపు విండ్ డిస్‌కంటిన్యూటీ కూడా వర్షాలకు కారణమవుతోంది. రాయలసీమ జిల్లాలతోపాటు దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్రలో పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇంకా చదవండి