Top Headlines On March 17th In Telugu States:
1. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బరిలో నిలిపారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధార్ కార్డు తరహాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే జులై (July) నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డుల (Health profile cards) ను ఇస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister sridhar babu) ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార్ సభ జరిగింది. ఈ సభలో కీలక ప్రకటన చేశారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం, ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది నోటీసులు
తనపై దుష్ప్రచారం చేశారంటూ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల నోటీసులు పంపించారు. ఫిబ్రవరి నెలలో రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ కేసు (Radisson Hotel Drugs Case)లో తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రాజేంద్రప్రసాద్ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన 10 కోట్ల దావా కింద.. మొత్తంగా రూ.160 కోట్లకు దావా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. వైసీపీకి మరో షాక్
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ZPTC గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో భారీగా డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక రిటైర్డ్ జవాన్ (BSF Jawan) ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యాన్ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం (Anantapur) నగరంలోని శిల్ప లేపక్షి నగర్ లో ఉంటున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ ఇంటి మీద మెరుపు దాడులు చేసి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 303 డిఫెన్స్ లిక్కర్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.