Seizure of defense liquor at retired BSF jawan in Anantapur district- అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక రిటైర్డ్ జవాన్ (BSF Jawan) ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యాన్ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం (Anantapur) నగరంలోని శిల్ప లేపక్షి నగర్ లో ఉంటున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ ఇంటి మీద మెరుపు దాడులు చేసి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 303 డిఫెన్స్ లిక్కర్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. 
రిటైర్డ్ ఆర్మీ జవాన్లతో కలిసి డిఫెన్స్ మద్యం విక్రయాలు
అనంతపురం జిల్లాకు చెందిన ఎన్ హనుమంత రెడ్డి రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాను తన తోటి రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్లతో కలిసి బెంగళూరులోని ఆర్మీ క్యాంటీన్లో డిఫెన్స్ మద్యాన్ని కొనుగోలు చేసి జిల్లా కేంద్రంలోకి తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తూ ఉండేవాడు. ఇతను నార్పల మండలం తుంపర గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ అయ్యాక నార్పల మండల కేంద్రంలో బట్టలు దుకాణం నిర్వహిస్తూ భార్య పిల్లలతో కలిసి అనంతపురం జిల్లా కేంద్రంలోని శిల్ప లేపాక్షి నగర్ లో నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని ఆర్మీ క్యాంటీన్లో తను తన రిటైర్డ్ జవాన్ల ద్వారా ఆర్మీ మద్యాన్ని కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు పోలీసులు గుర్తించారు. 


ఒక్కో బాటిల్ పైన సుమారుగా 250 రూపాయల దాకా అధికంగా విక్రయిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పోలీసు అధికారులకు పక్క సమాచారంతో ఈరోజు ఉదయం లేపాక్షి నగర్ లో ఉన్న హనుమంత రెడ్డి ఇంటిపై సబ్ ఆధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో ఐదున్నర లక్షల విలువగల 303 బాటిల్ల డిఫెన్స్ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఏపీలోకి కర్ణాటక మద్యం 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోకి కర్ణాటక నుంచి అక్రమ మద్యం వస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి అనంతపురం సరిహద్దు రాష్ట్రం కర్ణాటక వద్ద సబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులతో పాటు మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు ద్వారా కూడా ప్రకటబందిగా కర్ణాటక మద్యం ఏపీలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో కర్ణాటక నుంచి కాకుండా మద్యాన్ని కొందరు దుండగులు వివిధ కర్ణాటక సరిహద్దు గ్రామాల ద్వారా అనంతపురం జిల్లాలోకి తీసుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని నివారించేందుకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉన్న బళ్లారి, తుంకూరు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యాన్ని అడ్డుకుంటున్నామని వెల్లడించారు.


చిత్తూరు జిల్లా కుప్పం        
రూ.60వేల చేసే కర్ణాటక మద్యం సీజ్ చేసి ఇద్దరి నిందితులను కుప్పం ఎస్ఈబి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సృజన్ బాబు కథనం మేరకు... కుప్పం సోడిగానీపల్లి క్రాస్ వద్ద సోమవారం సెబ్ సిబ్బందితో వాహనాలు తనిఖి చేస్తుండగా మారుతి సుజుకి ఓంనీ, హోండా ఆక్టివాలో 60 పెట్టేల ఒరిజినల్ చాయిస్ విస్కీ 5760 టెట్రా పాకెట్లు, 30 బాక్స్ లలో సిల్వర్ కప్పు ర్యార్ ఇండియన్ బ్రాందీ 2,880 ప్యాకెట్లు రూ.60,000 వేల మద్యం ను స్వాదీనం చేసు కొన్నామన్నారు.