UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 147 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 01 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 147

1. సైంటిస్ట్-బి (మెకానికల్): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (మెకానికల్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్) లేదా ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి. 
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

2. ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: ఓబీసీ-01.
అర్హత: ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలలోపు ఉండాలి. 
అనుభవం: ఆంత్రోపాలజీలో మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి.

3. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ): 48 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-16, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-25, ఎస్సీ- 03, ఎస్టీ-01.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలలోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

4. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-04, ఈడబ్ల్యూఎస్-01. 
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

5. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ): 19 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-08, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-06, ఎస్సీ- 03, ఎస్టీ-01.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలలోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.

6. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ): 26 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-09, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-09, ఎస్సీ-05, ఎస్టీ-02.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలలోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

7. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓబ్‌స్టేట్రిక్స్‌, గైనకాలజీ): 20 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-11, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-04, ఎస్సీ-02, ఎస్టీ-01.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలలోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

8. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-02, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-02.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

9. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (వాటర్ రిసోర్సెస్): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-03, ఈడబ్ల్యూఎస్-01.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (డ్రిల్లింగ్/మైనింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/పెట్రోలియం టెక్నాలజీ).
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలలోపు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

10. సైంటిస్ట్-బి (సివిల్ ఇంజినీరింగ్): 08 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-05, ఎస్సీ-02, ఎస్టీ-01.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలలోపు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

11. సైంటిస్ట్-బి (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఓబీసీ-01, ఎస్సీ-01.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్).
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలలోపు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలలోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

12. అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ): 07 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-06, ఈడబ్ల్యూఎస్-01.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్/కెమికల్/మెరైన్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/సివిల్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్/ టెక్స్‌టైల్ కెమిస్ట్రీ/టెక్స్‌టైల్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్).
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలలోపు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.03.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.04.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 12.04.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..